న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోర్గాన్‌ మెరుపులు.. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ విజయం

Morgan blasts England to win over Pakistan

భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పాకిస్తాన్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బెన్ డెక్కెట్ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ జేమ్స్ విన్స్ క్రీజులోకి వచ్చిన జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. అయితే భారీ షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యి పెవియన్ చేరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సమయంలో ఇయాన్‌ మోర్గాన్‌ (29 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. మరోవైపు రూట్‌ (42 బంతుల్లో 47; 5 ఫోర్లు) కూడా అతనికి చక్కటి సహకారం అందించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. రూట్ ఔట్ అయినా మోర్గాన్‌.. డెన్లి (20)తో కలిసి మిగతా పని పూర్తి చేసాడు. పాకిస్థాన్ బౌలర్లలో వసీమ్, షాహిన్, హసన్‌ అలీ తలా ఒక వికెట్‌ తీశారు.

మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ (42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హారిస్‌ సొహైల్‌ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున జోఫ్రా ఆర్చర్‌ అరంగేట్రం చేసాడు. తాజాగా జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్ సీజన్-12లో సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, May 6, 2019, 10:02 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X