For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్, రహానే ఆడే అవకాశం లేదు.. ఇక ఇంటికి పరిమితం కావాల్సిందే!!

More wait for Rohit Sharma, Ajinkya Rahane? Red zoned Mumbai not allowed to resume cricket practice

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలకు పైగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. అందులో కొన్ని సడలింపులు ఇచ్చింది.

మహారాష్ట్రలో రెడ్‌ జోన్‌లు:

మహారాష్ట్రలో రెడ్‌ జోన్‌లు:

కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరాఖరి వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ.. అందులో కొన్ని సడలింపులు ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో స్టేడియంలు తెరుచుకోవచ్చని చెప్పింది. సదరు స్టేడియంలలో అటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ప్రేక్షకులను మాత్రం స్టేడియాల్లోకి అనుమతించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్రంలో రెడ్‌ జోన్‌లు అధికంగా ఉన్నాయి. ముంబైతో పాటు థానే, నేవీ ముంబై, మిరా భయాండర్, వసై విరార్, కళ్యాణ్ డొంబివిల్లి తదితర ప్రాంతాలు రెడ్‌ జోన్‌లోనే ఉన్నాయి.

ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు:

ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు:

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి.. రెడ్ జోన్‌లో క్రికెట్ కార్యకలాపాలను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన అధికారిక ఒకరు వెల్లడించారు. 'స్టేడియం మరియు క్రీడల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను మేము ఖచ్చితంగా పాటిస్తాం' అని ఎంసీఏ సీనియర్ అధికారి ఒకరు బుధవారం పీటీఐతో చెప్పారు. దీంతో ముంబైలో ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా పోయింది. రోహిత్, రహానేతో పాటు ముంబైలో ఉంటున్న చాలా మంది క్రికెటర్లు ఇప్పట్లో ఆడే అవకాశం లేదు.

ఇప్పట్లో ఐపీఎల్ అసాధ్యం:

ఇప్పట్లో ఐపీఎల్ అసాధ్యం:

లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా ప్రేక్షకులకు అనుమతి లేకుండా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దీంతో కరోనా వైరస్‌తో నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020 మొదలవుతుందేమోనని అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. కానీ.. స్టేడియాల్లోకి ఫ్యాన్స్‌ లేకుండా లీగ్‌ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య విమాన ప్రయాణ ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఐపీఎల్‌ నిర్వహణ అసాధ్యమని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ స్పష్టం చేశాడు.

సమీప స్టేడియాల్లో ప్రాక్టీస్‌:

సమీప స్టేడియాల్లో ప్రాక్టీస్‌:

ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించే ఆలోచన ఇప్పట్లో లేదని, అయితే స్థానికంగా సమీపంలో ఉన్న స్టేడియాల్లో వారు వ్యక్తిగతంగా ప్రాక్టీస్‌ చేసుకునేలా ప్రణాళిక రచిస్తున్నామని అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు. ఇందుకోసం రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో మాట్లాడతామని వెల్లడించాడు. రాష్ట్ర స్థాయిలో ఉన్న మార్గదర్శకాలను పరిశీలించడంతో పాటు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతోనూ బీసీసీఐ సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోనుంది.

Story first published: Wednesday, May 20, 2020, 19:51 [IST]
Other articles published on May 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+