
భారత్ మ్యాచ్ లు హాట్ స్టార్ పంట పండిస్తున్నాయి. మొన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ హాట్ స్టార్ లో కోటీ 80 లక్షల మంది చూడగా.. పెర్త్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న కోటీపైగా మంది హాట్ స్టార్ లో వీక్షిస్తున్నారు. భారత్ మ్యాచ్ లతో హాట్ స్టార్ భారీగా వ్యూవర్ షిప్ వస్తుంది. ఆసియా కప్ లోనూ భారత్ , పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల మంది చూశారు. మొన్న జరిగిన జింబాబ్వే, పాకిస్థాన్ మ్యాచ్ ఆరు మిలియన్ల మంది చూశారు.
సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఇండియా తడబడుతోంది.ఎంగిడి దెబ్బుకు భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో భారత్ ను ఆదుకున్నాడు. సూర్య 40 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్ లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్ క్రీజ్ లో ఉన్నంత సేపు అసౌకర్యంగా ఉన్నాడు. మొదటి ఓవర్ ఒక్క పరుగు కూడా చేయకుండా మెయిడిన్ చేశాడు. ఆ తర్వాత సిక్స్ కొట్టాడు. కేఎల్ రాహుల్ లుంగీ ఎంగిడి బౌలింగ్లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కేఎల్ రాహుల్ ఔట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. రాహుల్ ఏంటిది అని ప్రశ్నిస్తున్నారు. కేఎల్ రాహుల్ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించలేదు.రోహిత్ శర్మ 15 పరుగులు చేయగా.. కోహ్లీ 12 పరుగులు చేశారు. వరల్డ్ కప్ తొలిసారి అవకాశం వచ్చిన దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.