Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు: లాభమన్న కెప్టెన్ మోర్గాన్

హైదరాబాద్: త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఇంగ్లాండ్ నుంచి అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని మోర్గాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'అవును, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో నాతో పాటు చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. మా ఆటగాళ్లు అధిక సంఖ్యలో ఐపీఎల్ గేమ్స్ ఆడతారని ఆశిస్తున్నా. ఒకవేళ మా ఆటగాళ్లు అధిక సంఖ్యలో పాల్గొంటే మాత్రం అది కచ్చితంగా మాకు లాభిస్తుంది. ఇటీవల కాలంలో మా ఆటగాళ్లు విశేషంగా రాణిస్తుండటం ఐపీఎల్ రేసులో ఉండటానికి కారణం అవుతుంది' అని మోర్గాన్ తెలిపాడు.

More England Players To Be Available For IPL: Eoin Morgan

ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ ఆటను పెంపొందించుకోవడానికి ఐపీఎల్ ఎంతో సాయపడుతుంది కెప్టెన్ మోర్గాన్‌తో పాటు జోస్ బట్లర్ లాంటి వారు భావిస్తున్న తరుణంలో మోర్గాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వచ్చే ఐదు నెలల్లో స్వదేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు దృష్టి పెట్టాలని మోర్గాన్ సూచించాడు.

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌ ఓటమిని ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరిచిపోయి చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం కావాలన్నాడు. భారత్‌లో పిచ్‌లు చాలా భిన్నంగా ఉంటాయన్న మోర్గాన్.. ఇక్కడ ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్‌లు ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+