WTC Final రోహిత్ శర్మకు బిగ్ టెస్ట్.. కోహ్లీసేన ఫేవరేట్ కానీ.. : మాంటీ పనేసర్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్ ఎలెవన్‌ను ఎంపిక చేసేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ కసరత్తులు చేస్తోంది. అయితే టీమిండియా ఓపెనర్లు ఎవరా? అనే ప్రశ్న మాత్రం అందరిని వెంటాడుతుంది. జట్టులో మల్టీపుల్ ఓపెనర్స్ ఉండటం అందరూ ఫామ్‌లోకి రావడం సమస్యగా మారింది.

 రోహిత్ శర్మకు బిగ్ టెస్ట్

రోహిత్ శర్మకు బిగ్ టెస్ట్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. ఇంగ్లీష్ కండీషన్స్‌లో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రోహిత్, గిల్‌ను ఓపెనర్లుగా ఎంచుకోవాలి. రోహిత్‌కు ఈ మ్యాచ్ పెద్ద పరీక్ష కానుంది. ఎందుకంటే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని రోహిత్ అనుకుంటున్నాడు. ఇంగ్లిష్ పిచ్‌లపై మూవింగ్ బాల్‌పై బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఈ విషయంలో సక్సెస్ అయ్యి.. తాను భారత్‌లోనే డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు.

హిట్ మ్యాన్ జట్టుకు అవసరం..

హిట్ మ్యాన్ జట్టుకు అవసరం..

హోమ్ టెస్ట్ సిరీస్ స్పెషలిస్ట్ అనే ముద్ర నుంచి బయటపడాలని రోహిత్ చూస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడని, ఈ క్రమంలో వికెట్ పారేసుకకుంటాడన్న కారణంతో తనను ఓవర్సీస్ సిరీస్‌లకు సెలెక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. తను ఆడే స్టైల్ అది. సెహ్వాగ్ కూడా వన్డేల్లో అయినా.. టెస్ట్‌ల్లో అయినా ఇలానే ఆడి ఓ లెజెండ్ అయ్యాడు. రోహిత్‌కు ఇది బిగ్ సిరీస్ అవుతుంది. దూకుడుగా ఆడుతూ రన్స్ రాబట్టే తనలాంటి ప్లేయర్ టీమ్‌కు అవసరం'అని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

శుభ్‌మన్ బ్రేవ్ బ్యాట్స్‌మన్..

శుభ్‌మన్ బ్రేవ్ బ్యాట్స్‌మన్..

‘శుభ్‌మన్ గిల్ బ్రేవ్ బ్యాట్స్‌మన్. అతను కుర్రాడైన ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టం మనమంతా చూశాం. అతనికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. దాంతో పాటు పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకుంటాడు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్, శుభ్‌మన్ ఓపెనర్లుగా ఆడించడం ఉత్తమం. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు కూడా ఇదే బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్.'అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 6 ఇన్నింగ్స్ 52 సగటుతో శుభ్‌మన్ 259 రన్స్ చేశాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో 90+ పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, ఐపీఎల్‌లో ఈ యువ ఓపెనర్ దారుణంగా విఫలమయ్యాడు. తాజా ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రం 80+ స్కోర్ చేశాడు.

 ఇండియానే ఫేవరేట్..కానీ

ఇండియానే ఫేవరేట్..కానీ

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోలో భారత జట్టే ఫేవరేట్ అని పనేసర్ చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీసేన విజయవకాశాలు వాతవారణ పరిస్థితులపై ఆధారపడి ఉందన్నాడు. ‘నా అభిప్రాయం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియానే ఫేవరేట్. కానీ న్యూజిలాండ్‌పై కోహ్లీసేన విజయవకాశాలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో వెదర్ కీలక పాత్ర పోషించనుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని రోజులు వేడి గాలులు వీచే అవకాశం ఉంది. దీన్ని భారత్ తమకు అనుకూలంగా మార్చుకునేలా కసరత్తులు చేయాలి. భారత్‌దే పైచేయి అయినప్పటికీ.. వెదర్ కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణం వేడిగా, బాగా ఉంటే భారత్‌దే విజయం. అలా కాకుండా వర్షం పడితే మాత్రం న్యూజిలాండ్‌పై చేయి సాధిస్తుంది.'అని పనేసర్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 15, 2021, 8:59 [IST]
Other articles published on Jun 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X