డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియానే ఫేవరెట్..రూట్ సేనను 5-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది!ఇంగ్లండ్ స్పిన్నర్ జోస్యం!

లండన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటిసారి జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు మాజీలు కోహ్లీసేననే విజయం సాధిస్తుందని చెపుతుంటే.. మరికొంతమంది న్యూజిలాండ్‌దే ఛాంపియన్‌షిప్ అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్లేయర్స్ కూడా తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టెస్ట్ ఛాంపియన్‌షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులను కూడా భారత్ గెలుస్తుందన్నాడు.

అద్భుత ఫామ్‌లో భారత్:
జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది. ఆపై నెల రోజుల విరామం భారత జట్టుకు దొరుకుతుంది. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. ఇక ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ఢీకొట్టబోతోంది. టెస్టుల్లో ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్ కనబర్చుతున్న కోహ్లీసేన.. ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తోంది.

టీమిండియానే ఫేవరెట్:
'ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి బాగా టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే.. ఇంగ్లండ్‌ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్‌ని సమర్థంగా ఎదుర్కోలేరు. రూట్ మాత్రం ఎప్పుడూ పరుగులూ చేయలేడు కదా. ఒక్కసారి భారత స్పిన్నర్లకి ఈ విషయం అర్థమైతే.. సిరీస్ ఏకపక్షం అయిపోతుంది. 5-0తో భారత్ టెస్ట్ సిరీస్ గెలవొచ్చు. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్. ఎందుకంటే.. అన్ని విభాగాల్లో కోహ్లీసేన పటిష్టంగా ఉంది' అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు.

భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ఇక కేఎల్ రాహుల్, సాహాలను ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయనున్నారు.
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications