ముంబై vs చెన్నై మ్యాచ్ ఫిక్సయిందా?: కేఆర్‌కే ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కావాలనే ఓడిపోయిందా? అంటే అవుననే అంటున్నాడు బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లు టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్లు. లీగ్ స్టేజిలో అత్యధిక విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక, ఫైనల్ విషయానికి వస్తే చెన్నై అనవసర రనౌట్లతో మ్యాచ్ చేజార్చుకుంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై కమల్ ఆర్ ఖాన్
అయితే, ఈ రనౌట్ల వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. "ధోని, రైనా, అంబటి రాయుడు బలవంతంగా రనౌటయ్యారు. ఆఖరి ఓవర్‌లో షేన్ వాట్సన్ అనవసర రనౌట్ అవడం అనేది అంబానీ భారత్‌లో ఏమైనా చేయగలడు అనే దానికి నిదర్శనం. ఈ ప్రపంచంలో డబ్బు ఏదైనా చేయగలదు" అని ట్వీట్ చేశాడు.

ఆఖరి ఓవర్ ముందు వరకు
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ముందు వరకు విజయం చెన్నై సూపర్ కింగ్స్‌దేనని అంతా భావించారు. 76 పరుగులతో షేన్ వాట్సన్ సూపర్ ఫామ్‌లో ఉండగా... అతనికి తోడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. దీంతో చెన్నై తప్పక విజయం సాధిస్తుందని మ్యాచ్‌ని వీక్షించేవారంతా భావించారు.

ఒక పరుగు తేడాతో ముంబై విజయం
దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తద్వారా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.

ఆఖరి ఓవర్‌లో అంతా తారుమారు
అయితే, లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్‌లో అంతా తారుమైంది. మొదటి మూడు బంతుల్లో చెన్నై నాలుగు పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆఖరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో శార్ధూల్ ఠాకూర్ అనూహ్యంగా ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications