Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుండె బద్దలైందంటూ సిరాజ్ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. హార్ట్ బ్రేక్ సింబల్స్ పోస్ట్ చేశాడు. దానికి కారణాలేంటో మాత్రం వివరించలేదు. మరోవైపు సిరాజ్ పోస్ట్ గురించి కారాణాలంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వాస్తవం అనిపించేలా ఉన్నాయి.

ఇటీవల రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన రోహిత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం తిరిగి టీమిండియాతో చేరాడు. అయితే రోహిత్‌తో మాట్లాడిన తర్వాత సిరాజ్ ఎమోషనలై ఉంటాడని, అందుకే సూర్యకుమార్ యాదవ్‌లా హార్ట్ బ్రేక్ సింబల్స్ పోస్ట్ చేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Mohammed Sirajs emotional post saying that his heart was broken

మరోవైపు సిరాజ్ భావోద్వేగానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అని పోస్ట్‌లు పెడుతున్నారు. బౌలింగ్‌ను బలోపేతం చేయకుండా మరోసారి జట్టు యాజమాన్యం చెత్త నిర్ణయాలు తీసుకోవడంతో సిరాజ్ ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలతో ప్లేయర్లకు, ఫ్యాన్స్‌కు ఎప్పుడూ బాధ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

అలాగే షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా చూసి సిరాజ్ ఎమోషనలై ఉంటాడని కొందరు తమ వాదన వినిపిస్తున్నారు. డంకీ మూవీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటంతో సిరాజ్ ఫీల్ అయి ఉంటాడని అంటున్నారు.

కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడిన సిరాజ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. సౌతాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు, జనవరి 03 నుంచి కేప్‌టౌన్‌లో ఆఖరి టెస్టు జరగనుంది.

Story first published: Thursday, December 21, 2023, 14:24 [IST]
Other articles published on Dec 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+