రింకూ సింగ్‌తో మహ్మద్ సిరాజ్ పోటీ.. ఎవరు గెలిచారంటే? (Video)
జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికాతో కలిసి అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆఖరి మ్యాచ్‌తో పాటు సిరీస్‌లో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
అయితే ప్రపంచకప్‌లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్లేయర్లకు ప్రతి మ్యాచ్ లో 'ఫీల్డింగ్ మెడల్' ఇచ్చిన విషయం తెలిసిందే. అదే రీతిలో ఇప్పటినుంచి 'ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్'మెడల్ ను ఇస్తున్నట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చెప్పాడు. అయితే ఈ మెడల్ కోసం ముగ్గురు ప్లేయర్లు పోటీపడ్డారని వివరించాడు. వారిలో రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్, మహ్మద్ సిరాజ్‌ఉన్నారని తెలిపాడు.

కాగా, ముగ్గురిలో సిరాజ్‌కు ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందిస్తున్నట్లు ఫీల్డింగ్ కోచ్ తెలిపాడు. మెడల్ అందుకున్న అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. 'ఈ మెడల్ కోసం ప్రపంచకప్ నుంచి ఎదురుచూస్తున్నాని, మొత్తంగా ఇప్పుడు దక్కిందని' అన్నాడు. మూడో టీ20లో అర్షదీప్ బౌలింగ్ లో సింగిల్ కోసం ప్రయత్నించిన హెండ్రిక్స్‌ను సిరాజ్ డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications