For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్‌.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!

Mohammed Siraj, Shardul Thakur shine Australia bowled out for 294, India target 328

బ్రిస్బేన్‌: గబ్బా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు మహ్మద్‌ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ చెలరేగడంతో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని (33 ప‌రుగులు) కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. సీనియ‌ర్ బౌల‌ర్లు లేక‌పోయినా ఆ భారాన్ని త‌న భుజాల‌పై మోసిన సిరాజ్‌.. టెస్ట్ కెరీర్‌‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. శార్దూల్ కూడా 4 వికెట్ల‌తో రాణించాడు.

ఓపెనర్ల శుభారంభం

ఓపెనర్ల శుభారంభం

ఓవర్ నైట్ స్కోర్ 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌, మార్కస్ హ్యారిస్‌ జట్టుకు శుభారంభాన్ని అందించారు. నాలుగో రోజు ఆరంభంలో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్‌ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చారు. 26వ ఓవర్‌లో మార్కస్ హ్యారిస్‌ (38)ను శార్దూల్ ఠాకుర్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన హ్యారిస్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

ఆ తర్వాత ఓవర్‌ వేసిన వాషింగ్టన్ సుందర్‌.. అర్ధ శతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్‌ (48)ను బోల్తా కొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్‌ సమీక్షకు వెళ్లినా.. ఔట్ అనే తేలింది. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద వార్నర్‌ పెవిలియన్ చేరాడు. ఇక మొహ్మద్ సిరాజ్ 31వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 31వ ఓవర్ రెండో బంతికి మార్నస్ లబుషేన్‌ (25)ను ఔట్ చేయగా.. అదే ఓవర్ చివరి బంతికి మాథ్యూ వేడ్‌ను డకౌట్ చేశాడు. లబుషేన్‌ క్యాచును రోహిత్ శర్మ, వేడ్‌ క్యాచును రిషబ్ పంత్ అందుకున్నారు. దీంతో ఆసీస్ 123 వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

స్మిత్ హాఫ్ సెంచరీ

స్మిత్ హాఫ్ సెంచరీ

ఈ సమయంలో స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ ఆచితూచి ఆడారు. అయితే హాఫ్ సెంచరీ సాధించిన స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్‌ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్.. అజింక్య రహానే చేతికి చిక్కాడు. గ్రీన్‌-స్మిత్ అయిదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మిత్ అనంతరం గ్రీన్‌ కూడా పెవిలియన్ చేరాడు. అతడు 90 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఆపై కెప్టెన్ టీమ్ పైన్‌, పాట్ కమిన్స్‌‌ ధాటిగా ఆడారు. ఈ క్రమంలోనే పైన్ (27)ను శార్దూల్ ఔట్ చేశాడు. ఆపై క్రీజులోకి వచ్చిన వాళ్లంతా బ్యాటు ఝళిపిస్తూ స్కోరు సాధించారు. సిరాజ్‌ టెస్ట్ కెరీర్‌‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

మరోసారి ఆటకు అంతరాయం

మరోసారి ఆటకు అంతరాయం

టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. టీ విరామానికి ముందు కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు మరోసారి అడ్డుతగిలాడు. దీంతో మూడో సెషన్‌లో ఆట నిలిచిపోయింది. రోహిత్‌ శర్మ (4), శుభ్‌మన​ గిల్‌ (0) క్రీజులో ఉన్నారు. మూడో సెషన్‌లో ఇంకా 20 ఓవర్ల ఆట ఉంది. మరి ఈరోజు ఆట సాధ్యం అవుతుందో లేదో చూడాలి.

ఫీల్డింగ్ చేస్తూనే.. స్మిత్‌ని టీజ్ చేసిన రోహిత్! ఇది అందుకు ప్రతీకారమేనా? (వీడియో)!

Story first published: Monday, January 18, 2021, 12:45 [IST]
Other articles published on Jan 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+