For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెటర్ సిరాజ్ ఫేస్‌బుక్ హ్యాక్ చేసింది ఓ బాలుడా....?

Mohammed Siraj's social media accounts compromised, hacker sends 'I Love You' messages to all friends

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ జట్టుకు సెలెక్ట్‌ అయిన మహ్మద్‌ సిరాజ్‌ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే నేరస్థుడ్ని గుర్తించారు. సిరాజ్ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశాడు.

అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలోని బృందం కేసుపై విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను సైతం మార్చేశాడు. దీనికి గాను వాడిన ఫోన్ నంబరే అతన్ని పట్టించింది. అతను సిరాజ్‌కు పరిచయస్తుడే కావడంతో కేసు వద్దని చెప్పిన ఆయన ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు.

హ్యాకింగ్ చేసింది ఇలా..:
సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొద్ది నెలల ముందే ఎంపికయ్యాడు. దీంతో అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.
ఇందులో భాగంగానే ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఆ బాలుడు క్రికెటర్‌ కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో తేలిగ్గా సిరాజ్‌ ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు.

సిరాజ్ అకౌంటు నుంచి ఐ లవ్యూ అని:
సిరాజ్ ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న కొందరికి సందేశాలు పంపాడు. సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సైతం అతడి స్నేహితులకు ఐ లవ్యూ అనే సందేశం పంపాడు. ఈ విషయం గుర్తించిన సిరాజ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందంటూ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడే హ్యాకర్‌ అని గుర్తించిన అధికారులు విషయం సిరాజ్‌కు వివరించారు. అతడు తన కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో కేసు వద్దని పోలీసులకు చెప్పిన సిరాజ్‌ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 11:51 [IST]
Other articles published on Jan 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+