Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా పేసర్‌కు మరో బాధ్యత.. హైదరాబాద్ కెప్టెన్‌గా స్టార్ బౌలర్!

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా సీవీ మిలింద్‌‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ నియమించింది. ఎలీట్ గ్రూప్-బీలో చోటు దక్కించుకున్న హైదరాబాద్ జట్టు.. అక్టోబర్ 11న త్రిపురతో జరిగే పోరుతో తన రంజీ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

IND vs BAN: అందుకే చిత్తుగా ఓడాం: బంగ్లాదేశ్ కెప్టెన్

IND vs BAN: అందుకే చిత్తుగా ఓడాం: బంగ్లాదేశ్ కెప్టెన్

గత సీజన్(2025-26) ఎలీట్ గ్రూప్-డీలో హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి రెండు పరాజయాలు, నాలుగు డ్రాలతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. రాబోయే సీజన్ కోసం జట్టును మెరుగ్గా తీర్చిదిద్దేందుకు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవలే చెన్నైలో ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో మహ్మద్ సిరాజ్, మిలింద్ ఇద్దరూ సౌత్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 0/140, 1/47 బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా.. మిలింద్ 2/88, 1/27 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో 43 పరుగులు సాధించి రాణించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ జోన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Mohammed Siraj Named Hyderabad Captain for Ranji Trophy 2026-27 Season CV Milind named vice-captain

సిరాజ్, మిలింద్ రెడ్-బాల్ గణాంకాలు
2015 నవంబర్ లో అరంగేట్రం చేసిన మహమ్మద్ సిరాజ్ ఇప్పటివరకు హైదరాబాద్ తరఫున 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 24.31 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన(5/52) ఉంది. ఓవరాల్‌గా 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో(భారత్ తరఫున 48 టెస్టులతో సహా) 172 ఇన్నింగ్స్‌లలో 321 వికెట్లు తీశాడు. సిరాస్ బెస్ట్ బౌలింగ్ 2018లో నమోదు చేశాడు. ఆస్ట్రేలియా-ఏపై ఇండియా-ఏ తరఫు 59 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు.

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

Also Read

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

మరోవైపు సీవీ మిలింద్ హైదరాబాద్ జట్టుకు 54 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి 30.16 సగటుతో 136 వికెట్లు సాధించాడు. అలాగే బ్యాటింగ్ లో ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీల సాయంతో 1,368 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్లో మొత్తంగా 57 మ్యాచ్‌లలో 140 వికెట్లు తీయడంతో పాటు 1,445 పరుగులు చేశాడు.

Story first published: Saturday, September 12, 2026, 11:14 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+