వేలంలో సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సిరాజ్ ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, వేలంలో సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. ఐపీఎల్-11వ సీజన్‌లో మొత్తం 17 మ్యాచ్‌లాడిన సిరాజ్ 21 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్త కారుతో దిగిన ఫొటోను సిరాజ్ ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘న్యూ రైడ్' అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
జులై 4నుంచి వెస్టిండీస్-ఎతో
త్వరలో సిరాజ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఇండియా-ఎ జట్టుకు ఎంపికైన సిరాజ్ జులై 4నుంచి వెస్టిండీస్-ఎతో నాలుగు రోజుల టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ లయన్స్ జట్టులతో తలపడనున్నాడు.
కొత్తగా విడుదలైన జీప్ కంపాస్ కారును
మొహమ్మద్ సిరాజ్ మార్కెట్‌లోకి కొత్తగా విడుదలైన జీప్ కంపాస్ కారును కొనుక్కున్నాడు. దీని ధర సుమారు రూ.14లక్షల నుంచి రూ.20లక్షల వరకూ ఉండొచ్చు. గల్లీ స్థాయి క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరుకు అతనికి అభిమానులు పెరిగిపోయారు.

కెప్టెన్‌గా కరుణ్ నాయర్
24 ఏళ్ల సిరాజ్ జూలై4న భారత్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. బెక్కెనమ్ లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్న ఈ సిరీస్ జూలై 13కు ముగింపుకు చేరుకుంటుంది. భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా కరుణ్ నాయర్ వ్యవహరిస్తుండగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications












