Mohammed Siraj : చివరి ఓవర్లో నేనే సిక్స్ కొట్టేయాలనుకున్నా కానీ.. అక్షర్ పటేల్ కోసం..!

వెస్టిండీస్‌పై రెండో వన్డేలోనూ భారత్ 2వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయింది. అక్షర్ పటేల్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 నాటౌట్) వీరోచిత పోరాటం టీమిండియాకు అద్వితీయ విజయాన్ని అందించింది. అక్షర్ పటేల్ చివరి ఓవర్ 4వ బంతికి సిక్స్ కొట్టిన అనంతరం.. స్టాండ్స్‌లో నుంచి మ్యాచ్ చూస్తున్న సహచర ఆటగాళ్లు ఎగురుతూ దూకుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ ధావన్ సెల్ఫీ ద్వారా సహచర ఆటగాళ్లతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియోను శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం డ్రెస్సింగ్ రూంకు వస్తున్న మ్యాచ్ విన్నర్ అక్షర్ పటేల్‌ను టీమిండియా స్టాఫ్, ప్లేయర్లు అభినందనలతో ముంచెత్తారు. ఇక మ్యాచ్ చివరి ఓవర్ క్రీజులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ సైతం డగౌట్ వైపు వచ్చాక అతను బీసీసీఐ టీవీ ప్రెజెంటేటర్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సెకండ్ రన్ తీయలేక..
చివరి ఓవర్లో అక్షర్‌తో జరిగిన సంభాషణ గురించి సిరాజ్ ప్రస్తావించాడు. ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్లో భారత్ విజయానికి 8పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ తొలుత డాట్ బాల్ ఆడాడు. ఇక రెండో బంతికి షాట్ ఆడగా సింగిల్ వచ్చింది. అయితే సెకండ్ రన్ కోసం ప్రయత్నించినప్పటికీ.. సిరాజ్, అక్షర్ మధ్య సమన్వయం కొరవడింది. దీంతో సింగిల్‌కే పరిమితమయ్యారు. మూడో బంతికి సిరాజ్ సింగిల్ తీసివ్వగా.. నాలుగోబంతికి అక్షర్ లో ఫుల్ టాస్ బంతికి సిక్స్ కొట్టి విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇక సెకండ్ రన్ కోసం ఎందుకు పరుగెత్తలేదు అంటూ ప్రజెంటేటర్ అడగ్గా సిరాజ్ ఫన్నీగా బదులిచ్చాడు.

ఆ క్షణం నేనే సిక్స్ కొట్టేస్తే పోలా అనిపించింది
'నిజమే రెండో బంతికి డబుల్ తీయాల్సింది. కానీ ఔటయ్యే అవకాశాలున్నట్లు కన్పించింది. అవతలి ఎండ్‌లో అక్షర్ భాయ్ బాగా ఆడుతున్నాడు. ఆ ఓవర్‌కు ముందు మేం చర్చించుకున్నాం కూడా. తానే క్రీజులో ఉండేలా చూసుకుందామని ఇరువురం అనుకున్నాం. అయితే రెండో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఇకపోతే మూడో బంతికి ఆ టైంలో ఒక్క క్షణం నేనే సిక్స్ కొట్టేస్తే పోలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ అది రిస్కీ విషయమని.. ఎలాగోలా సింగిల్ తీసిస్తే అక్షర్ మిగతా పని చూసుకుంటాడని సర్ది చెప్పుకుని సింగిల్ తీసిచ్చా. తర్వాత జరిగింది మీకు తెలిసిందే' అంటూ సిరాజ్ పేర్కొన్నాడు.

312పరుగుల భారీ టార్గెట్ ఛేదన
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. షై హోప్ (135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో అక్షర్ పటేల్ దండెత్తి మ్యాచ్‌ను ఇండియా చేతిలో పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications