For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammed Siraj : కేఎల్ రాహుల్ ఫ్రీడం ఇస్తాడు.. అందువల్లే ఇలా బౌలింగ్ చేస్తున్నాం

Mohammed Siraj Explains His Bowling Plans in Whiteball Format and He Praises KL Rahul For giving Freedom

ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టూర్‌లో మా ప్లాన్లను అమలు చేసేందుకు బౌలర్లకు స్వేచ్ఛనిచ్చాడని, జట్టు వాతావరణం చాలా బాగుందని భారత పేసర్ మహమ్మద్ సిరాజ్.. స్టాండ్-ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ప్రశంసించాడు. 'వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనలో నేను బాగా బౌలింగ్ చేశాను. ఇక జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కూడా నా రిథమ్ బానే ఉంది. నేను వికెట్లు పడతాయా లేదా అనే ఆందోళన లేకుండా నిలకడగా బౌలింగ్ చేయాలని చూస్తున్నా. అదే నా ప్లాన్.' అని సిరాజ్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపాడు. ఇక రెండో వన్డేలో సిరాజ్ ఒక వికెట్ తీశాడు. అలాగే తన ఎనిమిది ఓవర్ల కోటాలో 16పరుగులు మాత్రమే ఇచ్చాడు.

'మొదట మేము సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. జట్టులో వాతావరణం చాలా బాగుంది. కేఎల్ రాహుల్ భాయ్ బౌలర్లకు చాలా స్వేచ్ఛను ఇస్తాడు. అందువల్ల నేను నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే నాకు అంతకుముందు నుంచి అవుట్‌స్వింగ్ వేసే ఉంది. కానీ దాని గురించి నాకు పెద్దగా నమ్మకం లేదు. ఇప్పుడు నేను సీమ్‌పై ఎక్కువ పనిచేస్తున్నాను. నాకు మంచి ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. బాల్ నా చేతి నుంచి చక్కగా రిలీజ్ కావడం మీరు చూసే ఉంటారు. ఆ రిథమ్‌తో మాత్రమే బౌలింగ్ చేస్తున్నాను.' అని సిరాజ్ తెలిపాడు.

ఇకపోతే సిరాజ్ ఇప్పటివరకు 13 టెస్టులు ఆడాడు. మొత్తంగా 40వికెట్లు తీశాడు. సిరాజ్ రెడ్ బాల్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అయితే అతను వైట్ బాల్ గేమ్‌లో మాత్రం నిలకడగా ఆడట్లేదు. వైట్‌బాల్ క్రికెట్‌లో మీ బౌలింగ్లో ఏమైనా మార్పులు చేశారా అని అడిగినప్పుడు.. సిరాజ్ మాట్లాడుతూ.. 'నేను నాపై నమ్మకం ఉంచాను. ఎందుకంటే ఎత్తుపల్లాలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే.. కాబట్టి నేను వైట్ బాల్ క్రికెట్లో కూడా రాణిస్తానని నమ్మకంగా ఉన్నాను.

నా మెయిన్ టార్గెట్ ఏంటంటే.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేలా బౌలింగ్ వేయాలి. ఎక్కువ డాట్ బాల్స్ వేయాలని కోరుకుంటున్నాను. కొత్త బాల్‌తో కొన్ని సార్లు వికెట్ల తీయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే రెడ్ బాల్‌తో పోల్చితే వైట్ బాల్ ఎక్కువగా స్వింగ్ కాదు. కాబట్టి నేను మెయిడెన్ ఓవర్ల కోసం ప్లాన్ చేస్తున్నాను.' అని సిరాజ్ చెప్పాడు.

Story first published: Sunday, August 21, 2022, 13:05 [IST]
Other articles published on Aug 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+