నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్ కింగ్ కోహ్లీవే.. సిరాజ్ భావోద్వేగ పోస్ట్

విరాట్ కోహ్లీ ఇటీవల టీమిండియా కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. దీంతో పలువురు క్రికెటర్లు కోహ్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా తనకు విరాట్ కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశాడు.
నువ్వే నా సూపర్ హీరో
''నువ్వే నా సూపర్ హీరో. నీ నుంచి నాకు లభించిన మద్దతుకు, ప్రోత్సాహానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. నువ్వు నాకు ఎప్పుడూ పెద్ద అన్నవే. ఇన్నేళ్లుగా నన్ను నమ్మి, నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. నేను చెత్త ప్రదర్శన ఇచ్చిన ప్రతి సారి నా లోని గొప్ప ఆటగాడిని చూసినందుకు ధన్యావాదాలు. నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్ కింగ్ కోహ్లివే'' అంటూ సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్టులో రాసుకొచ్చాడు.

కోహ్లీ కెప్టెన్సీలో అరంగేంట్రం
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే మహమ్మద్ సిరాజ్ వన్డే, టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ నాయకత్వంలోనే ఆడాడు. కాగా కొత్త బంతిని స్వింగ్ చేయగల సిరాజ్ సామర్థ్యాన్ని తరచుగా విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్టు మ్యాచ్‌కు సిరాజ్ దూరమయ్యాడు. అలాగే బుధవారం జరగనున్న తొలి వన్డేలో కూడా సిరాజ్ ఆడడం అనుమానంగానే ఉంది.

కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై
2014లో ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ ఏడేళ్ల పాటు సారథిగా కొనసాగాడు. ఈ క్రమంలో 68 టెస్టు మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కోహ్లీ 40 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. 11 మ్యాచ్‌లు డ్రా కాగా, 17 మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్దు సృష్టించాడు. విదేశాల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించాడు. కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో టీమిండియా ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. సేన దేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్ గెలిచింది. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అధిక్యంలో నిలిచింది. అలాగే ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications