For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

"5 వికెట్లు తీస్తే ఎవరిని కౌగిలించుకోవాలి?".. సిరాజ్ భావోద్వేగం!

Mohammed Siraj: ఇంగ్లండ్ జట్టుతో ఓవల్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. బుమ్రాపై వర్క్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని అతనికి విశ్రాంతి ఇచ్చారు.మ్యాచ్ రెండో రోజున బీసీసీఐ ఒక అప్‌డేట్ ఇస్తూ.. జస్ప్రీత్ బుమ్రాను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. అంటే మ్యాచ్ ముగిసే వరకు కూడా అతను జట్టుతో ఉండడు. ఈ నేపథ్యంలో సహచర పేసర్ మహ్మద్ సిరాజ్ అతడిని ఎక్కువగా మిస్సవుతున్నాడు. ఇంగ్లండ్ జట్టుపై రెండో రోజు అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో తన చివరి సంభాషణ ఏమిటో సిరాజ్ పంచుకున్నాడు.

బుమ్రాతో సిరాజ్ భావోద్వేగ సంభాషణ
జస్ప్రీత్ బుమ్రా ఓవల్ టెస్ట్ రెండో రోజు ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఇంగ్లాండ్‌ను 247 పరుగులకు పరిమితం చేయగలిగింది.

Mohammed Siraj Emotional on Jasprit Bumrah s Absence in Oval Test

బీసీసీఐ విడుదల చేసిన ఒక వీడియోలో మహమ్మద్ సిరాజ్, బుమ్రాతో తన చివరి సంభాషణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "జస్సీ భాయ్‌కు నేను ఇలా చెప్పాను, 'మీరు ఎందుకు వెళ్తున్నారు? నేను 5 వికెట్లు తీస్తే ఎవరిని కౌగిలించుకోవాలి?' అని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. దానికి బుమ్రా, 'నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు 5 వికెట్లు తీసుకో' అని అన్నాడని తెలిసింది. మా మధ్య జరిగిన సంభాషణ అంతే అని మహ్మద్ సిరాజ్ పంచుకున్నాడు. ఈ మాటలు వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, మైదానంలో వారి ఆప్యాయతను స్పష్టం చేస్తున్నాయి.

భారత పేస్ యూనిట్ మధ్య పెరుగుతున్న సమన్వయం
మహమ్మద్ సిరాజ్‌తో పాటు ఈ ఇన్నింగ్స్‌లో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. భారత పేస్ బౌలింగ్ యూనిట్ మధ్య పెరుగుతున్న అద్భుతమైన సమన్వయం గురించి ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడాడు. ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ.. "సిరాజ్, నేను ఐదేళ్లుగా కలిసి ఆడుతున్నాము, ఐపీఎల్ కూడా కలిసే ఆడాం. మేము మైదానం బయట కూడా చాలా మాట్లాడుకుంటాం. ఆకాష్ దీప్‌తో కూడా అంతే - మా పేస్ బౌలింగ్ గ్రూప్ నిజంగా చాలా పదునుగా కనిపిస్తోంది. ఇది జట్టుకు గొప్ప సంకేతం" అని చెప్పాడు.

ట్రాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తర్వాత భారత్ ఇంగ్లాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ చేసింది. 23 పరుగులతో వెనుకబడిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. బుమ్రా లేకపోయినా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్‌తో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.

Story first published: Saturday, August 2, 2025, 12:03 [IST]
Other articles published on Aug 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+