Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ మంచికే చెబుతున్నా.. ఇంగ్లాండ్‌కు సిరాజ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి సారిగా సొంతమైదానంలో టెస్టు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. క్రికెటర్‌గా తీర్చిదిద్దని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ సిరాజ్ కంటతడి పెట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌లో బాజ్ బాల్‌ను అనుసరిస్తే రెండు రోజుల్లోనే పరాజయాన్ని చవిస్తారని హెచ్చరించాడు.

''ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు మా తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, సీరియస్‌గా ఉందని తెలిసింది. సిరీస్ మధ్యలోనే మరణించారనే చేదువార్త తెలిసింది. ఆస్ట్రేలియాలో నా టెస్టు అరంగేట్రం చూడకుండానే మా నాన్న లోకాన్ని విడిచాడు. అది నా జీవితంలో అత్యంతర కష్టతరమైన సమయం. అయితే మా నాన్న కలను నెరవేర్చాలనే సంకల్పంతో నిలిచాను. టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించాను'' అని సిరాజ్ అన్నాడు.

Mohammed Siraj emotional ahead of India vs England first test

2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ టెస్టు అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. సీనియర్ పేసర్లు జట్టుకు దూరమైన ఆ సమయంలో టీమిండియా పేస్ దళాన్ని సిరాజ్ గొప్పగా నడిపించాడు. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా ఆసీస్‌లోనే ఉండి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొద్దికాలంలోనే టీమిండియా జట్టులో విలువైన బౌలర్‌గా సిరాజ్ పేరు సంపాదించాడు.

ఇంగ్లాండ్ జట్టు గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ''భారత్‌లో బాజ్ బాల్ అప్రోచ్‌తో ఇంగ్లాండ్ ఆడాలని భావిస్తే టెస్టు ఫలితం ఒకటిన్నర లేదా రెండు రోజుల్లోనే వచ్చేస్తుంది. ప్రతి సందర్భంలో హిట్టింగ్ చేయడం అంత సులువు కాదు. ఇక్కడ బంతి కొన్నిసార్లు గింగరాలు తిరుగుతుంది. మరికొన్ని సార్లు నేరుగా వికెట్ల మీదకు వస్తుంది. కాబట్టి ఇక్కడ బాజ్‌బాల్ పనిచేయదని అనుకుంటున్నా. అయినా వాళ్లు అదే పద్ధతిలో ఆడతానంటే అది మాకే మంచిది. అంతేగాక మ్యాచ్ తొందరగా ముగుస్తుంది'' అని సిరాజ్ అన్నాడు.

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, డాన్ లారెన్స్

Story first published: Wednesday, January 24, 2024, 13:13 [IST]
Other articles published on Jan 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+