Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ హాట్‌టాపిక్‌గా సిరాజ్.. ఆమెతో కలిసి డ్యూయెట్‌ సాంగ్‌ పాడుతూ..

టీమిండియా హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌.. లెజెండరీ సింగర్ ఆశాభోస్లే మనవరాలి విషయంలో మరోసారి వార్తల్లో హాటటాపిక్ గా నిలిచాడు. తాజాగా ఆమెతో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీకి సిరాజ్‌ కేవలం నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపిక అయిన సంగతి తెలిసిందే.

Mohammed Siraj Duet song With Zanai Bhosle Granddaughter Ahead Of CT 2025
Photo Credit: instagram screen shot

తన కోసమే ఈ సాంగ్..

సిరాజ్ - జనై భోస్లే ఓ డ్యూయెట్‌ సాంగ్‌ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సిరాజ్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'మన కలల్ని అనుసరించడానికి కారణమైన వ్యక్తి కోసమే ఈ సాంగ్. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌' అంటూ జనై గురించి రాసుకొచ్చాడు సిరాజ్. వీడియోలో జనై భోస్లేతో కలిసి సిరాజ్ పాట పాడుతూ కనిపించాడు. జనై తాజా మ్యూజిక్‌ ఆల్బమ్‌లోని కెహందీ హై సాంగ్ నే ఈ ఇద్దరు ఆలపించారు.

ఆమె నా సోదరి..
జనై భోస్లేతో సిరాజ్‌ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబయి బాంద్రాలో జరిగిన జనై పుట్టిన రోజు వేడుకలకు సిరాజ్ హాజరై సన్నిహితంగా ఫొటోలు దిగాడు. దీంతో వీరిద్దరిపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ సిరాజ్‌.. ఆమె తనకు చెల్లెలు లాంటిదని స్పష్టత ఇచ్చాడు. ఓ కవిత్వాన్ని కూడా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. జనై కూడా.. సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడని చెప్పడంతో ఆ రూమర్స్ కు చెక్‌ పడింది.

Story first published: Wednesday, February 19, 2025, 10:32 [IST]
Other articles published on Feb 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+