Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ మియా మహ్మద్ సిరాజ్ ఖాతాలో మరో గౌరవం వచ్చి చేరింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలోనే మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలను అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను నియమించారు.
రాహుల్ సింగ్ స్థానంలో సిరాజ్
ఇప్పటివరకు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ సింగ్ స్థానంలో సిరాజ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. రాహుల్ సింగ్ ఇకపై జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న సిరాజ్, రంజీల్లో జట్టును ముందుండి నడిపించడం వల్ల హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని హెచ్‌సీఏ భావిస్తోంది.

ముంబై, ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో..
హైదరాబాద్ జట్టు గ్రూప్-డి లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. జట్టును నాకౌట్ దశకు చేర్చే లక్ష్యంతో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. జనవరి 22న ముంబైతో కీలక పోరు జరగనుంది. జనవరి 29న ఛత్తీస్‌గఢ్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సిరాజ్ జట్టును నడిపించనున్నాడు.
హెచ్‌సీఏ చీఫ్ సెలక్టర్ ఏమన్నారంటే?
హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ చీఫ్ పి. హరిమోహన్ స్పందిస్తూ.. "మేము సిరాజ్‌తో మాట్లాడాం, మిగిలిన సీజన్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటానని తెలిపాడు. సిరాజ్ ఒక ఫైటర్, మైదానంలో ఎప్పుడూ గెలవడానికే ప్రయత్నిస్తాడు. అతని రాకతో ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవు, మా జట్టు మరింత బలోపేతం అవుతుంది" అని మహ్మద్ సిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.
రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టు:
మహమ్మద్ సిరాజ్ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె. రోహిత్ రాయుడు, కె. హిమతేజ, ఎ. వరుణ్ గౌడ్, ఎం. అభిరత్ రెడ్డి, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), అమన్ రావు పేరాల, సి.టి.ఎల్. రక్షణ్ రెడ్డి, ఎన్. నితిన్ సాయి యాదవ్, కనాల నితేష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), బి. పున్నయ్య.