షమీ విజృంభణ, 6 పరుగుల వ్యవధిలో 4వికెట్లు కోల్పోయిన ఆసీస్

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ విజృంభించాడు. దీంతో ఆసీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సమీ ఐదు వికెట్లతో ఆసీస్‌ను హడలెత్తించాడు. దీంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఆసీస్ 198 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బుమ్రా ఎనిమిదో వికెట్‌గా కమిన్స్(1)ను చక్కటి బంతితో పెవిలియన్‌కి పంపించాడు. సోమవారం నాల్గో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు సాధించి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.
6 పరుగులు వ్యవధిలో 4 వికెట్లు
టిమ్ పైన్(37), ఆరోన్ ఫించ్(25), ఉస్మాన్ ఖవాజా(72)లను కొద్దిపాటి వ్యవధిలోనే పెవిలియన్‌కు సాగనంపారు. పైన్, ఫించ్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసిన షమీ.. మరో 3 ఓవర్లలోపే ఖవాజాకు షాకిచ్చాడు. అటు తర్వాత బుమ్రా బౌలింగ్‌లో కమిన్స్(1) ఔట్ కావడంతో ఆసీస్ 198 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. 192 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. 198 పరుగుల వద్ద మరో రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఆసీస్ 6 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో టీమిండియాకు మ్యాచ్‌పై పట్టుచిక్కింది.
ఎనిమిది వికెట్లలో ఐదు వికెట్లు షమీ
132/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ నిలకడగా ఆడే యత్నం చేసింది. పరుగుల విషయాన్ని పక్కకు పెట్టి టీమిండియా బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే లంచ్ సమయం వరకూ ఆసీస్ కుదురుగా బ్యాటింగ్ చేసింది. ఆపై మహ్మద్ షమీ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఆసీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. గుడ్ లెంగ్త్, బౌన్సర్లు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతో షమీ తన బౌలింగ్‌లో పదునుచూపించాడు. ఆసీస్ కోల్పోయిన ఎనిమిది వికెట్లలో ఐదు వికెట్లు షమీ సాధించాడు.
షమి 5, బుమ్రా 2, ఇషాంత్ ఒక వికెట్
ప్రస్తుతం 86 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. క్రీజులో లైయన్ (1), స్టార్క్ (0) ఉన్నారు. భారత బౌలర్లలో షమి 5, బుమ్రా 2, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ఇలాగే బౌలింగ్ చేస్తే.. టీమిండియా లక్ష్యాన్ని చేధించేందుకు అవకాశాలు లేకపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications