న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో.. పరుగును మెరుగుపరుచుకునేందుకు షమీ ఏంచేస్తున్నాడో తెలుసా?!!

Mohammed Shami Sprints Alongside His Pet Dog To Improve Speed

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఫిట్‌నెస్‌ ఎలా కాపాడుకోవాలో అని సతమతమవుతున్న భారత క్రికెటర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ​టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ఫిట్​నెస్ కసరత్తులు చేస్తున్నాడు. షమీ మునుపటి పరుగు వేగాన్ని అందుకునేందుకు తన పెంపుడు శునకంతో పొలాల్లో పరుగెత్తాడు. శునకంతో పరుగెత్తుతూ.. మునుపటి తన పరుగు వేగాన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

శునకంతో పరుగు

శునకంతో పరుగు

శునకంతో పరుగు తీస్తున్న వీడియోను మహమ్మద్ షమీ శుక్రవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. 'జాక్​తో స్పీడ్​వర్క్' అని వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పరుగులో ఎక్కువ భాగం షమీనే ఆధిపత్యం ప్రదర్శించినా.. చివరలో శునకం అతణ్ని దాటేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. టీమిండియా అన్ని ఫార్మాట్​లలో కీలక బౌలర్​గా షమీ ఉన్నాడు. మళ్లీ ఆట ప్రారంభమయ్యే నాటికి పూర్తి ఫిట్​నెస్​ను సాధించేందుకు కృషి చేస్తున్నాడు.

లాక్​డౌన్ సమయంలో మాస్కులు

లాక్​డౌన్ సమయంలో మాస్కులు

లాక్​డౌన్ సమయంలో ప్రజలకు మాస్కులతో పాటు నిత్యావసరాలను మహమ్మద్ షమీ సైతం అందించాడు. రహదారులపై వెళుతున్న వలస కార్మికులకు ఆహారాన్ని అతడు అందించిన విషయ తెలిసిందే. షమీ భారత్ తరఫున 49 టెస్టులు ఆడి 180 వికెట్లు, 77 వన్డేలు ఆడి 144, 11 టీ20లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేసాడు. మెగా టోర్నీలో ఉమేష్ యాదవ్ (18) తర్వాత అత్యధిక వికెట్లు (17) తీసిన భారత బౌలర్ షమీనే. 2015 ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లాడిన షమీ.. 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు.

 షమీ స్త్రీలోలుడు

షమీ స్త్రీలోలుడు

రెండేళ్ల క్రితం మహమ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం ఆమెను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లో వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హాసిన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

జకోవిచ్‌ కోచ్‌కు కరోనా పాజిటివ్‌!!

https://telugu.mykhel.com/tennis/novak-djokovic-coach-goran-ivanisevic-tests-positive-for-coronavirus-028849.html

View this post on Instagram

Speed work with jack

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

Story first published: Saturday, June 27, 2020, 11:36 [IST]
Other articles published on Jun 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X