షమీ ఓ మ్యాచ్ ఫిక్సర్, దుబాయిలో పాకిస్థాన్ అమ్మాయితో: కేసు నమోదు

Posted By:
Mohammed Shami's match-fixing & extramarital affair with a Pakistani
Mohammed Shami's wife Hasin Jahan

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన అతడి భార్య హసీన్‌ జహాన్‌ తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసేవాడని వెల్లడించింది.

తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, గృహ హింసకు పాల్పడుతున్నాడని బుధవారం సాయంత్రం షమి భార్య హసీన్‌ జహాన్‌ న్యాయవాదితో కలిసి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం షమితో పాలు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్‌‌కు చెందిన ఓ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని, అయితే ఎందుకోసం అతడు ఆ డబ్బు తీసుకున్నాడన్న తనకు తెలియదని చెప్పిన హసీన్‌ జహాన్‌... తనను మోసం చేసిన అతడు దేశాన్నీ కూడా మోసం చేయలగలడని పేర్కొంది.

'షమి నాతోపాటు దేశాన్నీ మోసగించగలడు. దుబాయ్‌లో అలీ సబా అనే పాకిస్థాన్‌ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడు. అయితే అ డబ్బు ఎందుకోసం ఇచ్చిందన్న సంగతి మాత్రం చెప్పలేదు. నాకూ తెలియదు. అలీష్‌బాతో షమికి సంబంధాలున్నాయనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి' అని తెలిపింది.

షమీ చెప్పిన ఆ రికార్డింగ్‌ నా దగ్గర ఉంది

షమీ చెప్పిన ఆ రికార్డింగ్‌ నా దగ్గర ఉంది

'తాను డబ్బు తీసుకున్నానని షమీ చెప్పిన రికార్డింగ్‌ కూడా నా దగ్గర ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన మహ్మద్‌ భాయ్‌ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. దుబాయ్‌లో వారు బస చేసిన హోటల్‌కు వెళ్తే అతడు గది తీసుకున్నాడా లేదా అన్నది తేలిపోతుంది. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి' అని డిమాండ్‌ చేసింది.

బాలీవుడ్‌ నటిని వివాహం చేసుకోవాలనే కోరిక

బాలీవుడ్‌ నటిని వివాహం చేసుకోవాలనే కోరిక

దీంతో పాటు తనను వివాహం చేసుకొని పెద్ద తప్పుచేశానని షమీ తరచూ అంటుండేవాడని హసీన్‌ వివరించింది. 'వెనకా ముందు చూసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానంటూ గత రెండేళ్లుగా నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. కోహ్లీ మాదిరే ఓ బాలీవుడ్‌ నటిని వివాహం చేసుకోవాలనే కోరిక షమిలో బలంగా ఉంది. అందుకే నాకు విడాకులివ్వాలని నన్ను ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు' అని తెలిపింది.

నన్ను చంపి శవాన్ని అడవుల్లో పూడ్చాల్సిందిగా

నన్ను చంపి శవాన్ని అడవుల్లో పూడ్చాల్సిందిగా

'2017 లంక పర్యటనకు నన్ను కాకుండా తన పాకిస్థానీ గర్ల్ ప్రెండ్‌ను తీసుకెళ్లాలని అనుకున్నాడు. అంతేకాదు నన్ను చంపి శవాన్ని అడవుల్లో పూడ్చాల్సిందిగా యూపీలోని అతడి సోదరుడికి చెప్పాడు' అని ఆమె వాపోయింది. మాజీ మోడల్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చీర్‌ లీడర్‌ అయిన హసీన్‌ జహాన్‌తో ప్రేమలోపడ్డ షమీ ఆమెను 2014లో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లికిముందు నుంచే ఓ అమ్మాయితో అఫైర్‌

పెళ్లికిముందు నుంచే ఓ అమ్మాయితో అఫైర్‌

షమీకి పెళ్లికిముందు నుంచే ఓ అమ్మాయితో అఫైర్‌ ఉండేదని ఆమె తెలిపింది. ‘షమీతో నాకు పరిచయం అవడానికి ముందు.. తుబా అనే అమ్మాయితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ అతని ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పాకిస్థాన్‌, దుబాయ్‌ యు వతులతోనూ అక్రమ సంబంధాలున్నాయి' అని వెల్లడించింది.

దుబాయ్‌లో పాకిస్థాన్ అమ్మాయితో హోటల్ గదిలో

దుబాయ్‌లో పాకిస్థాన్ అమ్మాయితో హోటల్ గదిలో

'గతనెల దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని అతడు వస్తున్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. జట్టు సభ్యులంతా భారత్‌ వచ్చేయగా షమీ మాత్రం దుబాయ్‌లో ఆగాడు. పాక్‌కు చెందిన ఓ మహిళను అతడు ఎయిర్‌పోర్టులో కలుసుకోవాల్సి ఉందని ఫోన్‌ చాటింగ్‌ ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్‌లో చెక్‌ఇన్‌ అయ్యాడు. దుబాయ్‌, పాకిస్థాన్‌ వెళ్లిన ప్రతిసారి ఆ మహిళలను అతడు హోటల్‌కు రప్పించుకుంటాడు. వాటిని నేను ధ్రువీకరించుకోవడంతో ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడు' అని హసీన్‌ చెప్పింది.

నిజమని తేలితే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా

నిజమని తేలితే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా

భార్య హసీన్‌ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని గురువారం సాయంత్రం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో షమీ వివరించాడు. ఇదంతా నా పేరును దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. హసీన్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని, అందుకే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. నేను నా భార్యతో మాట్లాడానికి చాలా సార్లు ఫోన్‌ చేశాను. కానీ ఆమె నా ఫోన్‌ ఎత్తడం లేదు. నా మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమైతే నా భార్య, అభిమానులను క్షమించమని అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందామని అనుకుంటున్నా.. కానీ తన చర్యలు చూస్తుంటే.. నేను కూడా ఈ విషయంలో లీగల్ సహాయం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నా' అని షమీ అన్నాడు.

Story first published: Friday, March 9, 2018, 11:00 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి