షమీకి రన్‌అప్ ప్రాబ్లమ్, బుమ్రా కంట్రీ క్రికెట్ ఆడాలి: వసీమ్ అక్రమ్

హైదరాబాద్: సఫారీ గడ్డపై టీమిండియా పేసర్లు ప్రదర్శన పట్ల పాకిస్థాన్ పేస్ లెజెండ్ వసీమ్ అక్రమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, మహ్మద్ షమి రన్-అప్‌ను సరిచేసుకుంటే, బుమ్రా కౌంటీ క్రికెట్ ఆడితే ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా పేసర్లు అద్భుత ప్రదర్శన చేస్తారని అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన వసీమ్ అక్రమ్ పాత తరంతో పోలిస్తే, ఈ తరం భారత పేసర్లు ప్రత్యర్ధి జట్లపై చేసే దాడి చాలా బాగుందని కితాబిచ్చాడు. ముఖ్యంగా భారత పేసర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని, అయితే కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
'షమి చాలా మంచి బౌలర్. కాకపోతే కొన్నిసార్లు పరుగెత్తడంలో వేగం తగ్గిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. ఒక ఫాస్ట్ బౌలర్‌గా అతడు మ్యాచ్‌తో, పరిస్థితులతో సంబంధం లేకుండా వేగంగా పరుగెత్తాలి. బ్యాట్స్‌మెన్ ఫ్రంట్ ఫుట్ వేయకుండా చూసుకోవాలి' అని అక్రమ్ పేర్కొన్నాడు.

షమి ఆగి వేగం తగ్గిస్తున్నాడని అనిపిస్తోంది
'బౌలింగ్ చేసేటప్పుడు షమి ఆగి వేగం తగ్గిస్తున్నాడని అనిపిస్తోంది. క్రీజు వద్దకు వచ్చే సమయానికి సమంగా అడుగులు వేసి పరుగెత్తితే అతడి బౌలింగ్ బాగుంటుంది. మధ్యలో కాస్త ఆగినట్టు అడుగులు వేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. దృఢంగా ఉండే షమి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి బౌలర్‌గా ఎదిగాడు. అందుకే ఈ చిన్న సవరణలు చేసుకుంటే చాలా బాగుంటుంది' అని అన్నాడు.

షమీలో ఓ చిన్న సమస్య ఉంది
అంతేకాదు షమీ తన శరీర కండరాలపై దృష్టి పెట్టాలని అక్రమ్ సూచించాడు. 'షమీలో ఓ చిన్న సమస్య ఉంది. షోయబ్ అక్తర్‌ను చూస్తే అతడు మోకాలు సమస్యతో బాధపడ్డాడు. షమీ కూడా లోయర్ బాడీ కండరాలపై వర్క్ చేస్తే బాగుంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో షమీ మరో పదేళ్లు రాణించగలడు. కాబట్టి అతడు తన శరీరంపై దృష్టి సారించాలి' అని అక్రమ్ అన్నాడు.

మైకేల్ హోల్డింగ్స్ వ్యాఖ్యలతో ఏకీభవించిన అక్రమ్
ఇక, జస్ప్రీత్ బుమ్రా కౌంటీ క్రికెట్ ఆడితే ఇంకా మెరుగవుతాడు అన్న మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్స్ వ్యాఖ్యలతో అక్రమ్ ఏకీభవించాడు. ‘మైక్‌తో నేను ఏకీభవిస్తాను. ఇంగ్లాండ్ పిచ్‌లపై అనుభవం ఉంటేనే బుమ్రా పిచ్‌పై బంతిని బలంగా వేయగలడు. ఏడాదిలో ఒక నెల అతడు కౌంటీ క్రికెట్ ఆడేలా బీసీసీఐ అనుమతి ఇస్తే మంచిది' అని అన్నాడు.

కౌంటీలకు బుమ్రాను ఒక నెల పాటు వదిలివేయాలి
'కౌంటీలకు బుమ్రాను ఒక నెల పాటు వదిలివేయాలి. ఐపీఎల్ సమయంలో ఒక నెల బుమ్రాని ఇంగ్లాండ్ పంపించాలి. అప్పుడు బుమ్రా మరింత మెరుగైన క్రికెటర్ అవుతాడు. బుమ్రా టీ20 స్పెషలిస్టుగా క్రికెట్లో అడుగుపెట్టాడు. టెస్టు ఫార్మాట్‌కు అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. నా దృష్టిలో భువనేశ్వర్ అత్యుత్తమ బౌలర్. దక్షిణాఫ్రికాలో అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు' అని అక్రమ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications