లాజిక్‌తో ప్రశ్నించారు: షమీ భార్య స్లీవ్ లెస్ గౌనుపై షమీ తండ్రి
హైదరాబాద్: తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ గత రెండో రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 23న తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను షమీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
ఫోటోల కింద సంతోషంగా గడిపిన క్షణాలు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. అయితే ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేయగా మరికొందకు ఆమె ధరించిన దుస్తులు అందంగా ఉన్నాయని షమీకి మద్దుతుగా నిలిచారు.
భార్య స్లీవ్ లెస్ గౌను: షమీకి మాజీ క్రికెటర్ల మద్దతు
ఆమెకు మద్దతుగా నిలిచిన వారిలో క్రికెటర్ మహ్మద్ కైఫ్, బాలీవుడ్ గీత రచయిత జావెద్ అఖ్తర్ కూడా ఉన్నారు. తాజాగా తన కోడలు ధరించిన దుస్తులపై మహ్మద్ షమీ తండ్రి తౌషీఫ్ షమీ కూడా మద్దుతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'మా కోడలు ఏవైతే దుస్తులు ధరించిందో వాటికి మా పూర్తి మద్దతు ఉంది' అని అన్నారు.
'పబ్లిక్‌లో చూడలేదని, ఆమె శరీరంలోని ఏదైనా భాగాన్ని మీరెవరైనా చూడగలుగుతున్నారా? నా కోడలిని విమర్శించడానికి మీకు ఎలాంటి బిజినెస్ లేదు. నేను ఖురాన్ చదవలేదు. ఇతరుల నుంచి నేను విన్న దాని ప్రకారం స్త్రీలు స్లీవ్ లెస్ గౌను ధరించకూడదనే నిషేధం లేదు' అని తెలిపాడు.ఇస్లామిక్ పెద్దలు చెప్పిన దాని ప్రకారం మహిళలు పరదా మాత్రమే ధరించాలని ఆయన వెల్లడించారు.

నా కోడలు కూడా నా కూతురు లాంటిదే: షమీ తండ్రి
'నా కోడలు కూడా నా కూతురు లాంటిదే. ప్రస్తుతం చాలా మంది ముస్లిం యువతులు బుర్ఖాలను ధరించలేదు. ముస్లిం దేశాలైన పాకిస్థాన్, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, మలేషియాలో మహిళా రాజకీయ నేతలు, సినిమా హీరోయిన్లు, స్పోర్ట్స్ మహిళలు బుర్ఘా ధరించడం మీరు ఎప్పుడైనా చూశారా' అంటూ షమీ తండ్రి తౌషీఫ్ మీడియాలో ప్రశ్నించారు.

షమీ ఓ అంతర్జాతీయ క్రికెటర్: షమీ తండ్రి
షమీ ఓ అంతర్జాతీయ క్రికెటర్ అని, తన స్టాండర్స్, స్టేటస్‌కు తగ్గట్టుగా జీవిస్తాడని ఆయన స్పష్టం చేశారు. తన బెడ్ రూం లైఫ్‌లో కలగజేసుకునే అధికారం ఎవరికీ లేదని ఆయన సూచించారు. తన భార్య అంజుమ్ అరా, తన మరో కుమారుడి భార్య అసీబ్ కూడా బుర్ఘా ధరించరని ఆయన కుండబద్దలు కొట్టేశారు.

నాకు ఎలాంటి ఇబ్బందిలేదు: షమీ తండ్రి
అయినప్పటికీ తనకెలాంటి ఇబ్బంది లేదని ఆయన వెల్లడించారు. షమీ భార్య హసిన్ జహాన్‌తో మాట్లాడటం జరిగిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ కామెంట్లు రావడం గమనార్హం.
షమీకి మద్దతుగా క్రికెటర్ మొహమ్మద్ కైఫ్
టీమిండియా సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్... షమీకి మద్దతుగా నిలిచాడు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మహ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని కైఫ్ తన ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు.
షమీకి మద్దతుగా జావెద్ అఖ్తర్
ఇక బాలీవుడ్ ప్రముఖ గీత రచయిత జావెద్ అఖ్తర్ కూడా షమీకి బాసటగా నిలిచాడు. ‘‘ఆ అమ్మాయి డ్రెస్ ఎంత సొగసుగా, ఎంత పొందికగా ఉంది! ఆమె తొడుక్కున్న డ్రెస్‌తో ఎవరికైనా ప్రాబ్లం ఉందీ అంటే.. అది డ్రెస్ ప్రాబ్లం కాదు, బాగోలేదని కామెంట్ చేసిన వాళ్ల బుర్రలోని ప్రాబ్లం'' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications