హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తండ్రికి గురువారం గుండెపోటు వచ్చింది. దీంతో బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌లో ఉండగా షమీ కుటుంబం నుంచి సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన బెంగుళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరాడు.
ఉత్తరప్రదేశ్‌లో పుట్టి బెంగాల్ పేసర్‌గా అభిమానుల మన్ననలు అందుకుంటున్న షమీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఢిల్లీ వెళ్లాల్సిన విమానం 55 నిమిషాలు లేట్ అని సమాచారం ఇచ్చారు. దీంతో తన బాధను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
'గుండెపోటుతో నా తండ్రి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. బెంగుళూరు నుంచి ఢిల్లీకి వెళుతున్నాను. నా తండ్రి కోసం అభిమానులు ప్రార్ధించండి' అని కోరుతూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం 55 నిమిషాలు లేట్ అని తాను వేచి ఉంటే పరిస్ధితిలో లేనని మరో ట్వీట్ పోస్టు చేశాడు.
షమీ ట్వీట్‌కు టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. 'నీ తండ్రి కోసం నేను ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే గత వారంలో వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పేందుకు షమీ.. తన భార్య, కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నువ్వసలు ముస్లింవేనా? అంటూ కొందరు ప్రశ్నించారు. అలాంటి వారందరికీ ఘాటుగా సమాధానమిచ్చిన షమీకి తండ్రి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.