ఓవరాక్షన్ తగ్గించుకోవాలని హార్దిక్ పాండ్యాకు గట్టిగానే చెప్పా: మహమ్మద్ షమీ

ముంబై: క్రికెట్ మైదానంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తుందని, కొంచెం హుందాగా నడుచుకోవాలని తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సూచించానని గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ఐపీఎల్ 2022 సీజన్ ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో తప్పిదం చేశాడని మహమ్మద్ షమీపై హార్దిక్ పాండే నోరుపారేసుకున్నాడు. కనీసం సీనియర్ ప్లేయర్ అనే గౌరవం లేకుండా అసభ్యకర పదజాలంతో దూషించాడు. అప్పట్లోనే హార్దిక్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న షమీని హార్దిక్ టెంపర్‌మెంట్ గురించి ప్రశ్నించాడు.

ఏమోషన్స్ అదుపులో పెట్టుకోవాలి...

ఏమోషన్స్ అదుపులో పెట్టుకోవాలి...

'హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత చాలా సాధారణ వ్యక్తిగా మారాడు. ఆరంభంలోనే అతని అగ్రహానికి ఆపుకోలేక మైదానంలో విభిన్నంగా ప్రవర్తించాడు. అయితే ఏమోషన్స్‌ను అదుపులో పెట్టుకోవాలని నేను సలహా ఇచ్చాను. క్రికెట్‌ను యావత్ ప్రపంచం మొత్తం చూస్తోంది. కాబట్టి కెప్టెన్ అనేవాడు చాలా హుందాగా ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యూహాలు రచిస్తుండాలి. అయితే కెప్టెన్ హార్దిక్ తన రోల్‌ను పోషిస్తున్నాడు.

రాకెట్ సైన్స్ ఏం కాదు..

రాకెట్ సైన్స్ ఏం కాదు..

కెప్టెన్‌గా ఉండే వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించడం చాలా అవసరం. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో రకమైన స్టైల్‌, టెంపర్‌మెంట్ ఉంటాయి. ధోనీ మిస్టర్ కూల్.. చాలా నెమ్మదస్తుడు. అయితే కోహ్లీ మాత్రం అగ్రెసివ్. రోహిత్ పరిస్థితులకు తగ్గట్టుగా మ్యాచ్‌ని నడిపిస్తాడు. కాబట్టి హార్ధిక్ పాండ్యా మైండ్‌సెట్‌ని అర్థం చేసుకోవడం నాకు రాకెట్ సైన్స్ ఏమీ కాదు..' అంటూ వ్యాఖ్యానించాడు.

ముంబైతో మొదలై..

ముంబైతో మొదలై..

2015లో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా.. అతి తక్కువ కాలంలోనే పవర్ హిట్టింగ్ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకుని టీమిండియాతలుపు కూడా తట్టాడు. దాదాపు ఏడేళ్ల పాటు ముంబై జట్టుకు ఆడిన హార్దిక్ పాండ్యా... ఈ సీజన్ తో కొత్త జట్టు గుజరాత్ టైకు కెప్టెన్ గా మారిపోయాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 20 పాయింట్లు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఈ విజయాలకు హార్ధిక్ కెప్టెన్సీ కూడా ఓ కారణం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 16, 2022, 23:06 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X