Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Shami: మహ్మద్ షమీకి బిగ్ షాక్.. భార్యకు నెలకు రూ.4 లక్షల భరణం

Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనతో విడిపోయిన భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ. 4లక్షల భరణం చెల్లించాలని ఆయనను న్యాయస్థానం ఆదేశించింది. మహ్మద్ షమీ, హసీన్ జహాన్ మధ్య న్యాయ వివాదం చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. కోర్టు మహ్మద్ షమీని ప్రతి నెలా రూ.4లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.1.5లక్షలు హసీన్ జహాన్ ఖర్చుల కోసం రూ.2.5 లక్షలు వారి కుమార్తె ఐరా మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ అజయ్ ముఖర్జీ హసీన్ జహాన్ పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేశారు. మొదట హసీన్ జహాన్ నెలకు రూ.7లక్షలు డిమాండ్ చేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. ఇప్పుడు కలకత్తా హైకోర్టు షమీ వార్షిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదం
హసీన్ జహాన్, మహ్మద్ షమీల వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. హసీన్ జహాన్ గతంలో షమీ నుంచి నెలకు రూ.7లక్షల భరణం కోరింది. ఆ సమయంలో కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. హసీన్ జహాన్ మోడలింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని కోర్టు పేర్కొంది. హసీన్ జహాన్ ఓటమిని అంగీకరించకుండా ఈ నిర్ణయాన్ని సవాలు చేసింది. మొదట అలీపూర్ కోర్టు షమీని తన భార్య, బిడ్డ కోసం నెలకు రూ.80,000 చెల్లించాలని ఆదేశించింది. తర్వాత జిల్లా జడ్జి ఈ ఆదేశాన్నిసవరించారు. జిల్లా జడ్జి మహ్మద్ షమీని తన భార్య కోసం నెలకు రూ.50,000, బిడ్డ కోసం నెలకు రూ.80,000 చెల్లించాలని ఆదేశించారు.

Mohammed Shami Ordered to Pay Rs 4 Lakh Monthly Alimony to Wife Hasin Jahan Calcutta High Court Ruling

ఈ రూ.1.3 లక్షల భరణం ఆదేశం హసీన్ జహాన్‌‌కు ఆమోదయోగ్యం కాలేదు. అందుకే ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తన నెలవారీ ఖర్చు సుమారు రూ.6.5 లక్షలు అని ఆమె పేర్కొంది. షమీ వార్షిక ఆదాయం సుమారు రూ.7.5 కోట్లు అని హసీన్ జహాన్ వాదిస్తోంది. డబ్బు ఉన్నప్పటికీ షమీ తన భార్య, బిడ్డకు అవసరమైన డబ్బును ఇవ్వడం లేదని ఆమె పేర్కొంది. కలకత్తా హైకోర్టు షమీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.4లక్షల ఆదేశాన్ని జారీ చేసింది. ఈ మొత్తం విషయంలో మహ్మద్ షమీ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కోర్టు నిర్ణయంపై మహ్మద్ షమీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

Story first published: Wednesday, July 2, 2025, 10:31 [IST]
Other articles published on Jul 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+