Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షమీ రిటైర్మెంట్ ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన స్టార్ పేసర్!

టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025-26 దేశీవాళీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడి మహమ్మద్ షమీ ఏకంగా 67 వికెట్లు పడగొట్టినప్పటికీ.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ షమీని టీమిండియాలోకి రీకాల్ చేయలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీని సెలక్టర్లు పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు మహమ్మద్ షమీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

బోర్ కొడితే వీడ్కోలు ప్రకటిస్తా.. షమీ స్పష్టం
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు మహమ్మద్ షమీ చాలా నిర్మొహమాటంగా స్పందించారు. కేవలం వయసును బట్టి కాకుండా తన ఉత్సాహం తగ్గినప్పుడే ఆటకు స్వస్తి పలుకుతానని సెలెక్టర్లకు పరోక్షంగా సంకేతాలిచ్చాడు. "నేను ఎప్పుడు అలసిపోతానో, ఆ రోజే ఆటకు ముగింపు పలుకుతాను. కానీ ప్రస్తుతానికి నాకు రిటైర్మెంట్ ఆలోచనలు లేవు. అలాంటి ఆలోచనలు మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఒకవేళ ఆ ఆలోచన మనసులోకి వచ్చిందంటే.. మనం ఇప్పటికే అలసిపోయామని అర్థం. నేను ఎప్పుడు నిద్రలేచిన తర్వాత క్రికెట్ పట్ల బోర్‌‌గా ఫీలవుతానో ఆ రోజే వీడ్కోలు ప్రకటిస్తాను" అని మహమ్మద్ షమీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్నానని.. ఆటను ఎంజాయ్ చేస్తున్నానని.. ఫలితాలు కూడా సానుకూలంగానే ఉన్నాయని షమీ ధీమా వ్యక్తం చేశాడు.

Mohammed Shami on Retirement Will Quit When Bored Star Pacer Strong Message to Selectors

దేశవాళీలో సత్తా చాటినా చోటు దక్కలే..
2023 వన్డే ప్రపంచ కప్‌‌లో భారత్‌ను ఫైనల్ చేర్చడంలో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. అయితే గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైనా తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లకు, టీ20 వరల్డ్ కప్‌కు అతడిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని సెలెక్టర్లు యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్ తరపున కొత్త ప్రస్థానం
ఐపీఎల్ ప్రయాణంలోనూ మహమ్మద్ షమీ కొన్ని ఆసక్తికర మార్పులు ఎదుర్కొన్నారు. 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ షమీని కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ ఆశాజనకంగా లేకపోవడంతో 2026 సీజన్ కంటే ముందే షమీని విడుదల చేసింది.ప్రస్తుతం మహమ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ట్రేడ్ అయ్యారు. ఈ కొత్త జట్టు తరపున రాణిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు."లక్నో నాపై నమ్మకం ఉంచింది, నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. దేశవాళీ క్రికెట్‌లో నేను ఎన్ని వికెట్లు తీశాననే దానికంటే, నా బౌలింగ్ రిథమ్ బాగుందా లేదా అనే దానిపైనే నేను దృష్టి పెడతాను" అని షమీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. సెలెక్టర్లు పక్కన పెట్టినా, తనలో ఇంకా కసి తగ్గలేదని, వికెట్ల వేట కొనసాగిస్తానని షమీ ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు.

Story first published: Tuesday, March 31, 2026, 15:16 [IST]
Other articles published on Mar 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+