పాకిస్తాన్ బౌలర్‌కు బౌలింగ్ కిటుకులను చేరవేసిన మహ్మద్ షమీ..!!

బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి వామప్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వామప్ మ్యాచే అయినప్పటికీ.. నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టింది. హైడ్రామా మధ్య సాగిన చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. చివరి నాలుగు బంతులకు ఏడు పరుగులు చేయాల్సిన దశలో నాలుగు వికెట్లను కోల్పోయింది.

ఆరు పరుగుల తేడాతో..
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా తడబడింది. చేతులెత్తేసింది. 180 పరుగుల వద్దే ఆగిపోయిందా జట్టు జర్నీ. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఒత్తిడికి గురైంది. ఆ ఓవర్‌లో నాలుగు వికెట్లను కోల్పోయింది. చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడ్డాయి.

చివరి ఓవర్ హీరో..
చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా పరాజయాన్ని చవి చూడటం ఒక ఎత్తయితే.. నాలుగు వికెట్లను కోల్పోవడం మరో ఎత్తు. మహ్మద్ షమీ విసిరిన తొలి రెండు బంతులకు నాలుగు పరుగులొచ్చాయి. నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో వరుసగా వికెట్లు పడ్డాయి. నాలుగు బంతులకు నలుగురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. మూడో బంతికి పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యాడు. ఒంటి చేత్తో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నాలుగో బంతికి అష్టన్ అగర్ రనౌట్ అయ్యాడు.

మారుమోగుతున్న షమీ పేరు..
ఈ మ్యాచ్ తరువాత మహ్మద్ షమీ పేరు మారుమోగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడటం వల్ల మొన్నటి వరకు క్వారంటైన్‌లో గడిపాడు షమీ. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత జట్టులో చోటు కోసం కష్టపడ్డాడు. వందశాతం ఫిట్‌నెస్ కోసం శ్రమించాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు.

జట్టుతో కలిసిన మరుసటి రోజే..
అప్పటికే జట్టు మొత్తం కూడా ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. అకాడమీ నుంచి ఫిటనెస్ సర్టిఫికెట్ పొందిన తరువాత ఆలస్యంగా ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. నిజానికి- గాయపడ్డ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో తుది 15 మందిలో చోటు దక్కించుకున్నాడు షమీ. మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌తో కలిసి ఆస్ట్రేలియా చేరాడు. ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన మరుసటి రోజే వామప్ మ్యాచ్ ఆడాడు. తన తడాఖా చూపాడు. చివరి నాలుగు ఓవర్లల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. మరొకటి రనౌట్.

అఫ్రిదితో..
మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు- షమీ పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిదిని కలిశాడు. చాలాసేపు ఇద్దరూ కలిసి ముచ్చటించారు. బౌలింగ్‌లు కిటుకులను నేర్పించాడు. బంతిపై గ్రిప్ సాధించడం, దాన్ని ఎలా సంధించాలన విషయంపై అఫ్రిది తన సందేహాలను షమీని అడిగి తెలుసుకున్నాడు. వీరిద్దరూ ముచ్చటించుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవే చిట్కాలను నెట్ ప్రాక్టీస్‌లో ట్రై చేశాడు అఫ్రిది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications