టీమిండియా పేస్ త్రయం మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మెకాగ్రత్ సూచించాడు. కెరీర్‌లో మరికొంత కాలం కొనసాగాలంటే ఫాస్ట్ బౌలర్లు తమ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నాడు. షమి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.అండర్సన్‌ను షమి ప్రేరణగా తీసుకుని షమి మరింత శ్రమించాలని మెకాగ్రత్ సూచించాడు.
వన్డే వరల్డ్ కప్ అనంతరం మహ్మద్ షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయంతో బాధ పడుతున్న అతడు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అలాగే జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు షమి అందుబాటులో ఉండటం అనుమానమే.

''వచ్చే జనరేషన్‌ను చూడటానికి ఎదురుచూస్తున్నా. జస్‌ప్రీత్ బుమ్రాకు ఇంకా చాలా సమయం ఉంది. మహ్మద్ సిరాజ్‌కు సుదీర్ఘ కెరీర్ ఉంది. వాళ్లతో పోల్చుకుంటే షమికి కాస్త వయస్సు అయింది. భారత బౌలింగ్ దళంలో వాళ్లు మరికొంత కాలం కొనసాగుతారని తెలుస్తోంది. అయితే అది కఠినమైనది. ఆటలో టాప్‌గా ఉండవచ్చు. కానీ
వయస్సు పెరిగేకొద్దీ ఫాస్ట్ బౌలర్లకు శరీరంపై ప్రభావం చూపిస్తుంది''
''షమికి ఎంతో అనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా అతను సత్తాచాటుతున్నాడు. షమి అసాధారణ బౌలర్. కానీ వయస్సు పెరుగుతున్న కొద్ది.. మరింత శ్రమించాడానికి, రాణించడానికి అతనికి ప్రేరణ అవసరం. ఈ విషయంలో జేమ్స్ అండర్సన్‌ను చూడండి. అండర్సన్ 41 ఏళ్ల వయస్సులో 700 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇప్పటికీ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు'' అని మెకాగ్రత్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం మహ్మద్ షమికి 33 ఏళ్లు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షమి 64 టెస్టులు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. మరోవైపు బుమ్రాకు 30 ఏళ్లు కాగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు 29 ఏళ్లు. కాగా, షమి, బుమ్రా గాయపడి కొన్నాళ్లు టీమిండియాకు దూరమయ్యారు. కానీ, సిరాజ్ తన ఫిట్‌నెస్, పని భారాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు.