
హైదరాబాద్: డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
బెంగాల్ బ్యాట్స్‌మన్ అయిన అభిమన్యు.. పేరిట అతని తండ్రి డెహ్రాడూన్ ప్రాంతంలో అభిమన్యు క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న షమీకి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షమీ తలకు గాయాలైనట్లు సమాచారం.దీంతో అతని తలకు కుట్లు పడ్డాయి. దీంతో అక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.
అతని భార్య వరుస ఆరోపణల అనంతరం ఇటీవలే బీసీసీఐ అతనిని మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదంటూ తేల్చి చెప్పడంతో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ లో డేర్ డెవిల్స్ జట్టు తరపున ఆడనున్న షమీ మానసిక వేదనకు గురి చేశాడంటూ అతని భార్య పలు కేసులు నమోదు చేసింది.