క్లీన్‌స్వీప్ ఆలోచన లేదు: స్మిత్, వార్నర్ కట్టడికి ప్రత్యేక 'ప్లాన్'

Posted By:

హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయడం కష్టమేనని అన్నాడు.

ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టు కాబట్టి క్లీన్‌స్వీప్ అనే ఆలోచన చేయడం లేదని షమీ తెలిపాడు. అయితే ఆసీస్‌పై సిరీస్ గెలవడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. ఆ జట్టులోని ప్రధాన ఆటగాళ్ల కోసం తమ వద్ద ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పాడు.

స్మిత్, వార్నర్ కోసం ప్రత్యేక ప్లాన్

స్మిత్, వార్నర్ కోసం ప్రత్యేక ప్లాన్

'ఆసీస్ జట్టులోని ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ కోసం ప్రణాళికలను సిద్ధం చేశాం(ముఖ్యంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్). అయితే ఆ ప్లాన్స్‌ని మైదానంలో అమలు చేయడమే మా ముందు మిగిలుంది' అని షమీ పేర్కొన్నాడు. కాకపోతే అవి ఏమిటో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు.

భారత జట్టు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో

భారత జట్టు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో

ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోందని షమీ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టుని తేలిగ్గా తీసుకోవడం లేదని కూడా అన్నాడు. 'ఆసీస్ జట్టులో వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. అదే సమయంలో టీమిండియా కూడా బలంగానే ఉంది. స్వదేశంలో జరిగే సిరీస్ భారత్ ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కాకపోతే వైట్ వాష్ అనేది మా మదిలో లేదు'షమీ తెలిపారు.

ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడటంపై

ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడటంపై

ఇక, ఈ సిరిస్‌లో తన సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందని షమీ చెప్పాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 21న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇందుకోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డే

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డే

ఇప్పటివరకు 49 వన్డేలాడిన షమీ తన సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ ఐదు వన్డేల సిరిస్ ఆరంభం కానుంది. ఐదు వన్డేల సిరిస్ అనంతరం ఆస్ట్రేలియా అతిథ్య భారత్‌తో మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

Story first published: Friday, September 15, 2017, 10:38 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి