For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రెండో పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడ్నా'..??

Shami Talks About His Second Marraige
Mohammed Shami gives stinging reply to estranged wife Hasin Jahan after latest allegation

హైదరాబాద్: కొన్ని నెలలుగా టీమిండియా క్రికెటర్‌పై పలు రూమర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన భార్య మరోసారి మీడియా ముందుకొచ్చి షమీ రెండో పెళ్లికి సిద్ధమైపోయాడంటూ పలు వ్యాఖ్యలు చేసింది. దానిపై స్పందించిన షమీ గట్టిగానే బదులిచ్చాడు.

'ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా'? అని షమీ బదులిచ్చాడు. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగమైన షమీ మరి కొద్ది రోజుల్లో పర్యటనకు బయల్దేరనున్నాడు. ఇటీవల అతను ప్రాతినిథ్యం వహించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఐపీఎల్ 2018 అంతంత మాత్రంగానే రాణించింది. ఇవన్నీ కుటుంబంలో వివాదాల కారణంగానే సరిగ్గా ఆడలేకపోయానంటూ.. ఇంగ్లాండ్ పర్యటనలో చక్కటి ప్రదర్శన ఇస్తానంటూ షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'హసీన్ గత కొద్ది నెలలుగా నాపై బోలెడన్ని విమర్శలు చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేది కూడా అందులో ఒకటి. నా రెండో పెళ్లికి తనను ఆహ్వానిస్తా'నంటూ షమీ వ్యంగ్యంగా మాట్లాడాడు. మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహన్ మధ్య వివాదాలు ఆరంభం నుంచి మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. షమీ సోదరుడు అత్యాచారం చేశాడంటూ, షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ కోల్‌కతా పోలీసు స్టేషన్‌లో పలు ఆరోపణలతో కేసు నమోదు చేయించింది జహాన్.

రంజాన్ తర్వాత అతడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపించిన ఆమె మాట కూడా అవాస్తవమేనంటూ కొట్టి పడేశాడు షమీ. పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత షమీ తన వదినా వాళ్ల చెల్లెల్ని నిఖా చేసుకుంటాడని జహన్ చెప్పింది. కొద్ది రోజుల్లో నిజాలు తెలియాల్సి ఉంది.

Story first published: Monday, June 11, 2018, 9:13 [IST]
Other articles published on Jun 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+