For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్నతో రేప్ చేయించబోయాడు: షమీపై మరో బాంబు పేల్చిన భార్య

By Nageshwara Rao
Mohammed Shami forced me to have physical relationship with his brother, alleges Hasin Jahan

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అతడి భార్య హాసిన్‌ జహాన్‌ షమీ మోసగాడని, చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని కోల్‌కతా పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

హాసిన్‌ జహాన్‌ ఫిర్యాదుతో షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు, మరో నలుగురిపై ఐపీసీ (ఐపీసీ) 498-ఎ (మహిళపై భర్త, అతడి కుటుంబ సభ్యుల క్రూరత్వం) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా షమీ భార్య హసిన్‌ జహాన్‌ మరో సంచలన ఆరోపణ చేసింది. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని డీఎన్ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె వెల్లడించింది.

'ఓరోజు హసీబ్‌(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడి వేశాడు. లోపల హసిబ్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు' అని మీడియాకు తెలిపింది. షమీతో పాటు కుటుంబ సభ్యులందరూ తనపై దాడులకు పాల్పడేవారని ఆమె తెలిపింది.

విదేశాల్లో పర్యటించే సమయంలో షమీకి సెక్స్ వర్కర్లతో సంబంధాలు ఉండేవని కూడా ఆరోపించింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పింది. ఈ సందర్భంగా షమీతో జరిపిన ఫోన్‌ సంభాషణలను కూడా ఆమె మీడియా సమక్షంలో వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు షమీ చెప్పాడు.

హాసిన్‌ జహాన్‌ బయటపెట్టిన ఫోన్ సంభాషణలో 'షమి.. దయచేసి అబద్ధాలు చెప్పకు. నిజాలు బయటపెట్టు. నన్ను, ఐరాను, ఇరు కుటుంబాలను పట్టించుకోవడంలేదు. నీకు పాక్‌ బాలిక అలీషబానే ముఖ్యం. పోనీ ఆమె పేరు మీదన్నా నిజం చెప్పు. ఆ చాటింగ్‌లు నీవి కావూ' 'నావి దు' అని ఓ మగ గొంతు (షమీది) వినిపించింది.

ప్రస్తుతం షమీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం షమీపై కేసు నమోదైన అనంతరం షమీ అందుబాటులో లేకుండా పోయాడు. అంతేకాదు షమీ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. దీంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

షమీ మొబైల్‌ లోకెషన్‌ ప్రకారం చివరి సారిగా ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి అతని పెద్ద సోదరుడితో ఘజియాబాద్‌ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు షమీ కుటుంబానికి చెందిన పలువురు కోల్‌కతాలోని తన భార్య కుటుంబీకులతో కేసు విషయమై చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు షమీ మాత్రం మీడియాకు దూరంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షమీ, అతని సోదరుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంచారు. ప్రస్తుతం ఈ కేసును లాల్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి తీసుకుంది. షమీ కేసును విమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు కోల్‌కతా పోలీసులు తెలిపారు.

Story first published: Saturday, March 10, 2018, 17:30 [IST]
Other articles published on Mar 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+