న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1982లో పుట్టి 1990 సర్టిఫికేట్‌లతో బీసీసీఐని మోసం చేసిన షమీ

Mohammed Shami fooled BCCI, CAB: Hasin Jahan accuses Indian cricketer of age-fudging

హైదరాబాద్: భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీపై అతడి భార్య హసీన్‌ జహాన్‌ కొత్తగా మరో ఆరోపణ చేసింది. షమీ తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌)లను మోసం చేశాడంటూ మళ్లీ వార్తల్లో నిలిచింది. షమి 1990లో పుట్టినట్లు చెబుతున్న మాట అవాస్తవమని.. అతను పుట్టింది 1982లో అని ఆమె ఆరోపించింది. . అసలు వయసు కంటే ఎనిమిదేళ్లు తక్కువగా చూపించే ధ్రువపత్రాలతో అందర్నీ మోసం చేశాడని సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ ద్వారా బయట పెట్టింది.

అందులో షమి 1982లోనే పుట్టినట్లు ఉంది. ఐతే షమి బీసీసీఐకి, క్యాబ్‌కు 1990లో పుట్టినట్లుగా చూపే ధ్రువపత్రాలు సమర్పించాడని హసీన్‌ చెప్పింది. ''చూడండి మిత్రులారా.. ఇదీ షమి అసలు పుట్టిన తేదీ. అతను 1990లో పుట్టినట్లుగా తప్పుడు ధ్రువపత్రం సమర్పించి అందరినీ వెధవల్ని చేశాడు. తప్పుడు ధ్రువపత్రంతోనే అండర్‌-22 క్రికెట్‌ ఆడాడు. దీని వల్ల నిజంగా అర్హుడైన ఓ ఆటగాడు చోటు కోల్పోయి ఉంటాడు'' అని ఆమె పేర్కొంది.

ఐతే కాసేపటి తర్వాత హసీన్‌ ఈ పోస్టును తొలగించడం గమనార్హం. కానీ అప్పటికే అది సామాజిక మాధ్యయాల్లో విస్తృతమైపోయింది. దీనికి సంబంధించి షమీ ఫొటో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పోస్ట్‌ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను తొలగించింది. ప్రస్తుత రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990 కాగా... జహాన్‌ షేర్‌ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లో 1982గా ఉంది.

'షమీ నకీలీ జనన ధ్రువీకరణ పత్రాలతో తన పుట్టిన సంవత్సరం 1990గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్‌లతో పాటు ప్రజలను కూడా వంచించాడు. ఈ తప్పుడు పత్రాలతోనే అండర్‌-22 టోర్నీల్లో పాల్గొన్నాడు. దీనివల్ల అర్హులైన 22 ఏళ్ల వయసు గల క్రికెటర్లు నష్టపోయారు' అని ఆమె పేర్కొంది.

Story first published: Sunday, April 29, 2018, 10:55 [IST]
Other articles published on Apr 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X