
హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ తాజాగా మరోసారి ఆరోపణ చేసింది, షమీ తన బర్త్ సర్టిఫికెట్‌ను పత్రం తప్పుగా చూపించి బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ బోర్డును మోసం చేశాడని ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
అంతేకాదు షమీకి చెందిన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఫొటో తీసి పెట్టింది. ఇందులో షమీ పుట్టింది 1982 అని ఉంది. అయితే, గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రికెటర్ల వివరాలు తెలిపే ప్రముఖ వెబ్‌సైట్లలో షమీ పుట్టిన సంవత్సరం 1990 మార్చి 9న అని చూపిస్తోంది. దీని ప్రకారం షమీకి 28 ఏళ్లు.
శనివారం హసీన్ జహాన్ తన షేస్‌బుక్ పేజీలో షమీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఫొటోని పోస్టు చేసింది. అందులో షమీ పుట్టిన సంవత్సరం 1982 అని ఉంది. అయితే, తప్పుడు దృవపత్రాలు చూపించి షమీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐని, రాష్ట్రం తరఫున ఆడేందుకు బెంగాల్ క్రికెట్ బోర్డును, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా ఆమె పేర్కొంది.

అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత ఆమె తన ఫేస్‌బుక్ నుంచి ఆ పోస్టుని తొలగించింది. అయితే, అప్పటికే ఆ ఫోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పటికే ఆమె షమీ పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి షమీని విచారించిన సంగతి తెలిసిందే.