For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లాష్‌బ్యాక్ 2019: ఈ ఏడాది మహ్మద్‌ షమీ 'టాప్‌' లేపాడు!!

Mohammed Shami ends up as highest ODI wicket taker in a 2019 calendar year

హైదరాబాద్: స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ ఈ ఏడాది టీమిండియాకు 'ఆపద్బాంధవుడు' అయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నా అంటూ ఆదుకున్నాడు. బంతిని ఇవ్వగానే వికెట్లు తీస్తూ కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో జట్టుకు బలంగా మారాడు. సహచర ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ గాయాలతో జట్టుకు దూరమయినా.. యువ పేసర్లతో బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. మొత్తానికి ఈ ఏడాది మహ్మద్‌ షమీ 'టాప్‌' లేపాడు.

ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌:

ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌:

ఈ ఏడాది ఆరంభం నుండే షమీ వికెట్లు తీస్తున్నా.. ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనల్లో అద్భుతంగా రాణించాడు. టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్ ఏదైనా వికెట్లు తీయడమే అతని అంతిమ లక్ష్యం. ప్రతి సిరీస్‌లో రాణించి ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

21 మ్యాచ్‌లు 42 వికెట్లు:

21 మ్యాచ్‌లు 42 వికెట్లు:

2019లో షమీ 21 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును లిఖించుకున్నాడు. ఈ ఏడాది షమీ ఐదు వికెట్లను ఒకసారి సాధించగా.. ఒక హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. షమీ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (38), ఫెర్య్గుసన్‌ (35)లు ఉన్నారు.

2014 లో టాప్‌:

2014 లో టాప్‌:

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో షమీ అత్యధిక వన్డే వికెట్లు సాధించడం ఇది రెండోసారి. గతంలో 2014లో షమీ తొలిసారి అత్యధిక వన్డే వికెట్లతో టాప్‌ స్థానంలో నిలిచాడు. అప్పుడు 38 వికెట్లు తీసాడు. అయితే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో షమీ నాలుగో బౌలర్‌. అంతకుముందు కపిల్‌దేవ్‌ (32 వికెట్లు-1986లో), అజిత్‌ అగార్కర్‌ (58 వికెట్లు-1998లో), ఇర్ఫాన్‌ పఠాన్‌ (47 వికెట్లు-2004లో)లు ఉన్నారు.

వేగంగా 100 వికెట్లు:

వేగంగా 100 వికెట్లు:

వన్డేల్లో భారత్‌ తరఫున వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా షమీనే. 56 వన్డేల్లో ఈ ఘనతను అందుకున్నాడు అంటే షమీ హవా ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. భారత్‌ తరఫున షమీ ఇప్పటివరకు 47 టెస్టులు, 73 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 175 వికెట్లు, వన్డేల్లో 136 వికెట్లు, టీ 20 ఫార్మాట్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

మార్షల్‌ను గుర్తుకు తెస్తున్నాడు:

మార్షల్‌ను గుర్తుకు తెస్తున్నాడు:

షమీపై ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 'నన్ను గాఢ నిద్రలో కూడా ఉలిక్కి పడి లేచేలా చేసిన వెస్టిండీస్ దిగ్గజ బౌలర్‌ మాల్కమ్‌ మార్షల్‌ను షమీ గుర్తుకు తెస్తున్నాడు. అతడే నా ఫేవరెట్. షమీ బంతి వేసేందుకు పరిగెడుతుంటే ఆకలితో ఉన్న చిరుత వేటకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది' అని అన్నారు.

Story first published: Tuesday, December 24, 2019, 8:10 [IST]
Other articles published on Dec 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+