న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రేప్ జరిగిందని చెప్తున్న రోజు ఏం జరిగిందంటే..: షమీ

Mohammed Shami demands investigation, says relationship with wife Hasin Jahan over

హైదరాబాద్: షమీ ఎదురుదాడికి దిగాడు. మార్చి 6వ తేదీ నుంచి షమీ భార్య రోజుకో ఆరోపణ చేస్తూ వారం రోజుల పాటు మీడియా ముందుకొస్తూనే ఉంది. అలాంటిది షమీ నోరు విప్పడం మొదలుపెట్టగానే అతని భార్య హసీన్ జహాన్‌పై మరి కొన్ని నిజాలు బయటికొస్తున్నాయి.

తన భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణల్లో ఒక్కో దానికి వివరణ ఇస్తున్నాడు మొహమ్మద్ షమీ. 'హసీన్‌పై నా సోదరుడు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. ఆమె ఏ రోజైతే తన మీద అత్యాచారం జరిగిందని చెబుతుందో ఆరోజు ఏం జరిగిందంటే..

'గత ఏడాది డిసెంబరు 2 నుంచి 6 వరకు శ్రీలంకతో టెస్టు జరిగింది. ఆరో తేదీన బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశాడు. దీంతో మేము చివరి రోజు ఆట అనంతరం భువి విందుకు వెళ్లాం. ఆ తర్వాతి రోజు ఉదయం 10గంటలకు మేము ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిపోయాం. ఆ రోజు హోటల్ బిల్లును నా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాను. ఆ బిల్లు కూడా నా దగ్గర ఉంది.'

'అక్కడ నుంచి బయల్దేరి రావడానికి కారులో 4-5గంటల వరకు ప్రయాణం ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం 3.30గంటలకు మేము మా ఇంటికి చేరుకున్నాం. అప్పుడు నాకు కాస్త అనారోగ్యంగా కూడా ఉంది. అలానే నా సోదరుడితో కలిసి కాసేపటికి ఇంటికి చేరుకున్నాం. కొద్ది సమయంలోనే అతను తిరిగి ముర్దాబాద్‌లోని అతని ఇంటికి వెళ్లిపోయాడు. నేను ఫామ్ హోజ్ లోనే ఉండిపోయాను' అని వివరించాడు.

అసలు జరిగింది ఇది. ఏ రోజైతే మేము మా ఇంటికి వచ్చామో అదే రోజున తనపై మా అన్న అత్యాచారానికి పాల్పడ్డాడని చెబుతోంది. అదంతా అబద్ధం' అని వివరించాడు షమి. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్‌కు డేర్ డెవిల్స్ తరపున ఆడతాడా.. లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. షమిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఫిక్సింగ్‌ ఆరోపణలపై బీసీసీఐ విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, March 16, 2018, 18:29 [IST]
Other articles published on Mar 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X