Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: షమీ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత చెత్త బౌలింగ్

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డు ఉన్న భారత ఆటగాడిగా మహ్మద్ షమీ రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ బౌలింగ్ పేలవంగా ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో ముందుగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. షమీ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. మహ్మద్ షమీ వేసిన చివరి ఓవర్లో మార్కస్ స్టొయినీస్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్లోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో రెండో చెత్త బౌలింగ్ గణాంకాలు
మహ్మద్ షమీ 75 పరుగులు ఇవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. ఐపీఎల్ 2025 రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. ఆ రికార్డు తర్వాత కొన్ని రోజులకే మహ్మద్ షమీ ఇప్పుడు తన రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. షమీ 75 పరుగులు ఇచ్చాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మోహిత్ శర్మ 73 పరుగులు సమర్పించుకున్నాడు. అది ఐపీఎల్ లో మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శన.

Mohammed Shami Creates Record for Worst Bowling in IPL History

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలింగ్ స్పెల్స్ ఇవే..

0/76 - జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్) vs సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్, 2025

0/75 - మహమ్మద్ షమీ (సన్‌రైజర్స్ హైదరాబాద్) vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్, 2025

0/73 - మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్) vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ, 2024

0/70 - బాసిల్ థంపి (సన్‌రైజర్స్ హైదరాబాద్,) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బెంగళూరు, 2018

0/69 - యష్ దయాళ్ (గుజరాత్ టైటాన్స్) vs కోల్‌కతా నైట్ రైడర్స్, అహ్మదాబాద్, 2023

ఐపీఎల్ లో అత్యంత చెత్త బౌలింగ్ వేసిన భారత బౌలర్ గా మహ్మద్ షమీ ప్రస్తుతం రికార్డు సృష్టించాడు. భారత జట్టులో ప్రధాన బౌలర్ గా ఉన్న మహ్మద్ షమీ ఇలాంటి రికార్డును కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ లో 6 మ్యాచ్ ల్లో షమీ 5 వికెట్లు పడగొట్టాడు. షమీ బౌలింగ్ సగటు 46.6, షమీ ఓవర్ కు ఇచ్చిన సగటు పరుగులు 11.09 కావడం గమనార్హం. మహ్మద్ షమీ పేలవమైన ప్రదర్శన గురించి ఆందోళన పెరుగుతోంది. రాబోయే మ్యాచ్ లలో షమీ తిరిగి తన ఫామ్ ను పొందుతాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.

Story first published: Sunday, April 13, 2025, 12:35 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+