Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మూణ్నెల్ల తర్వాత తనని చూశా'

Mohammed Shami couldn’t hold on to emotions after seeing daughter

హైదరాబాద్: ఇటీవల జరిగిన యోయో టెస్టులో ఫిట్‌నెస్ నిరూపించుకోలేని షమీ ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పటికే భార్య ఆరోపణలతో పలు కేసులతో సతమతమవుతోన్న షమీకి ఇది జీర్ణించుకోలేని విషయం. అయితే, కొద్ది నెలల ముందు షమీతో గొడవపడి అతని కుటుంబానికి దూరంగా ఉంటున్న హసీన్ జహాన్ కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి హసీన్‌.. షమితో కలిసి ఉండట్లేదు. పాపను తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది.

ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకున్న జహాన్‌ కుమార్తెను తీసుకుని అతన్ని చూసేందుకు వచ్చింది. అప్పుడు జహాన్‌తో మాట్లాడేందుకు నిరాకరించిన షమి కుమార్తెతో మాత్రం కొద్ది సమయాన్ని గడిపాడు. ఇక అప్పటి నుంచి షమి తన భార్యాబిడ్డలను కలిసింది లేదు. తాజాగా షమి తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

మూడు నెలల తర్వాత కన్న కూతుర్ని చూసినట్లు తెలిపాడు భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమి. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే షమి వీడియో కాల్‌ ద్వారా తన కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫొటో. ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్న షమి 'నా గుండె చప్పుడు బెబోను చూడటం చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్‌ యూ. మూడు నెలల తర్వాత... లాంగ్‌ టైమ్‌' అని పేర్కొన్నాడు.

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. 'త్వరలోనే మీరంతా కలుస్తారు; మీ గొడవల్ని త్వరలోనే సద్దుమణుగుతాయి; నీకంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నాం' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో షమి భార్య హసీన్‌ జహాన్‌ తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తనను చంపడానికి ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేసి కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, June 20, 2018, 19:11 [IST]
Other articles published on Jun 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+