వివాదంలో షమీ! మహిళకు మెసేజ్..స్క్రీన్‌షాట్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి!

మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ గుర్తు తెలియని మహిళకు మెసేజీని పంపించాడు. ఈ మెసేజీని చూసిన బాధిత మహిళ దాని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. షమీ అమ్మాయిల పిచ్చోడని, అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నాడని అంటూ స్వయంగా అతని భార్య హసీన్ జహా ఆరోపించిన ఉదంతం విస్మరించక ముందే- షమీ మరోసారి అలాంటి పనే చేశాడు. హసీన్ జహా చేసిన ఆరోపణలు నిజమేనని తనకు తాను నిరూపించుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

గుర్తు తెలియని మహిళకు మెసేజ్
బాధితురాలి పేరు సోఫియా. ఆమెతో షమీకి ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేదు. అయినప్పటికీ.. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ఆమెకు విష్ చేశాడు. గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటూ ఓ మెసేజీని పంపించాడు. దీన్ని చూసిన సోఫియా నిర్ఘాంతపోయారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ ఘాటు కామెంట్‌ను దానికి జోడించారు. `14 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఓ క్రికెట్ ఆటగాడు.. తనకు మాత్రమే ఎందుకు మెసేజ్ చేశాడనే విషయాన్ని ఎవరైనా చెప్పగలరా?` అని సోఫియా వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టరెట్టీలు సైతం ఘాటుగా బదులిస్తున్నారు. పాపం షమీ యూకేలో ఒంటరిగా ఉంటున్నాడని సమాధానాలిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా టీమిండియాకు తలనొప్పిగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు.

షమీ లఫంగా గాడంటూ..
మహమ్మద్ షమీని పెద్ద లఫంగా గాడు అంటూ కొద్దిరోజుల కిందటే ఆయన భార్య హసీన్ జహా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అతనికి ఆడవాళ్లంటే పిచ్చి అని, పెద్ద విమెనైజర్ అని తిట్టిపోశారు. మహమ్మద్ షమీ ఇటీవలే టిక్ టాక్ అకౌంట్ తెరిచాడట. అందులో 10 కాదు.. 20 కాదు..ఏకంగా 90 మంది ఆడవాళ్లను అతను అనుసరిస్తున్నాడని హసీన్ జహా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాటిని షేర్ చేశారు. ఇదీ మహమ్మద్ షమీ అసలు బండారం అంటూ రాసుకొచ్చారు. రెండురోజుల కిందట తాను అతని టిక్ టాక్ అకౌంట్‌ను తెరిచి చూడగా మొత్తం 97 మందిని షమీ ఫాలో అవుతున్నారని, ఇందులో 90 మంది ఆడవాళ్లేనని అన్నారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఓ కుమార్తెకు తండ్రిగా ఉంటూ అమ్మాయిలు అంటే పడి చచ్చే షమీ ఓ షేమ్ లెస్ అని విమర్శించారు. ఏ మాత్రం సిగ్గు అనేదే లేదని.. ఛీ ఛీ అంటూ చీదరించుకున్నారు.

హసీన్ జహా.. షమీ వేర్వేరుగా..
సుమారు రెండేళ్లుగా మహమ్మద్ షమీ అతని భార్య హసీన్ జహా వేర్వేరుగా కాపురం ఉంటున్న విషయం తెలిసిందే. షమీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువని, చాలామందితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం షమీ, అతని తల్లి తనను చిత్రహింసలకు గురి చేశారని, వాటిని తట్టుకోలేక మెట్టినింటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. హసీన్ జహా గృహ హింస చట్ట కింద షమీపై కేసు సైతం నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications