Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. మహమ్మద్ షమీకి గుడ్ న్యూస్..!

ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన ఓ వివాదాస్పదన కేసులో న్యాయస్థానం షమీని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. భార్య హసీన్ జహాన్ గతంలో మహమ్మద్ షమీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. షమీ తనకు ఇచ్చిన లక్ష రూపాయల విలువైన చెక్ బ్యాంకులో బౌన్స్ అయిందంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు గత నాలుగేళ్లుగా కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో విచారణలో ఉంది. ఇరుపక్షాల వాదనలను విన్న అలీపూర్ కోర్టు.. బుదవారం(మే 20)తుది తీర్పును వెల్లడిస్తూ మహమ్మద్ షమీపై ఉన్న చెక్ బౌన్స్ ఆరోపణలను కొట్టివేసింది. ఆయనను ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తుడిని చేసింది.

14 ఏళ్ల రికార్డు.. 15 ఏళ్ల కుర్రాడు.. కొడితే చరిత్రే!

14 ఏళ్ల రికార్డు.. 15 ఏళ్ల కుర్రాడు.. కొడితే చరిత్రే!

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదం పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకు హసీన్ జహాన్ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.1.5 లక్షలు, అలాగే వారి కుమార్తెకు రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ మహమ్మద్ షమీ తన కూతురు అదనపు అవసరాల కోసం తన స్వచ్ఛంద నిర్ణయంతో ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటే.. దానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా గతేడాది జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ భార్య, కుమార్తె భృతి కోసం షమీ నెలకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హసీన్ జహాన్ తనకు రూ.4 లక్షలకు బదులుగా రూ.10 లక్షల భృతి కావాలని న్యాయస్థానంలో డిమాండ్ చేసింది.

Mohammed Shami Acquitted by Alipore Court in Cheque Bounce Case Filed by Hasin Jahan Full Details

మరోవైపు మహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే ఈ లీగ్‌లో ఆయన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్లో మహమ్మగ్ షమీ ఇప్పటివరకు సగటు ప్రదర్శనతోనే సరిపెట్టుకున్నాడు. ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 10 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. లక్నో యాజమాన్యం మహమ్మద్ షమీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఆయన తన బౌలింగ్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి మైదానంలో గడ్డు కాలం నడుస్తున్న తరుణంలో న్యాయస్థానం నుంచి చెక్ బౌన్స్ కేసులో సానుకూల తీర్పు రావడం షమీకి మానసికంగా పెద్ద ఊరటనిచ్చింది.

ప్లేఆఫ్స్ వేళ.. ఆర్సీబీకి గుడ్ న్యూస్

ప్లేఆఫ్స్ వేళ.. ఆర్సీబీకి గుడ్ న్యూస్
Story first published: Wednesday, May 20, 2026, 20:43 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+