Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ట్రోఫీలో రెండో ఆటగాడు: 4 బంతుల్లో 4 వికెట్లు!

Mohammed Mudhasir becomes 2nd player in Ranji Trophy history to take 4 wickets in 4 balls

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ 2018-19 సీజన్‌లో శుక్రవారం తొలి హ్యాట్రిక్ వికెట్ నమోదైంది. రంజీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శ్రీనగర్‌కు చెందిన 30 ఏళ్ల హ్మద్ ముదస్సర్ అనే దేశవాళీ ఆటగాడు ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

 రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో

రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో

జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా ముదస్సర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం మాత్రమే కాదు వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు నమోదు కావడం ఇది రెండోసారి.

మ్యాచ్ గమనాన్నే వేసిన ముదస్సర్

మ్యాచ్ గమనాన్నే వేసిన ముదస్సర్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 329/3తో పటిష్టస్థితిలో ఉంది. ఈ సమయంలో క్రీజులో చేతన్ బిస్త్, అశోక్ మనేరియా ఉన్నారు. ఇన్నింగ్స్ 97వ ఓవర్‌లో మనేరియా(59)ను ఔట్ చేసిన ముదస్సర్ రెండు ఓవర్ల అనంతరం పేసర్ ముదస్సర్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.

 వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు

పదునైన బంతులతో వరుసగా బిస్త్‌తో పాటు తజిందర్ సింగ్, రాహుల్ చాహర్, తన్వీర్ మశ్రత్ హుల్ హక్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బిస్త్(159) సెంచరీతో రాణించాడు. కాగా, 110వ ఓవర్లలో రాజస్థాన్ 379 పరుగులు చేసి ఆలౌటైంది.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదేసి వికెట్లు తీయడం ఐదోసారి

ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదేసి వికెట్లు తీయడం ఐదోసారి

ఈ మ్యాచ్‌లో 29 ఓవర్లు వేసిన ముదస్సర్ 5 వికెట్లు తీసి 90 పరుగులిచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదేసి వికెట్లు తీయడం అతనికి ఐదోసారి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ కాశ్మీర్ 51 ఓవర్లు ఆడి 148/6 వద్ద నిలిచింది. కెప్టెన్ పర్వేజ్ రసూల్(47) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

Story first published: Friday, November 2, 2018, 18:54 [IST]
Other articles published on Nov 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+