చూపులేకున్నా సివిల్స్ ర్యాంక్ సాధించిన నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ : మహ్మద్ కైఫ్

మ‌ధురై : కంటి చూపు లేకున్నా అతికష్టమైన సివిల్స్ పరీక్షలో ర్యాంకు సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పురాణ సుంతారీ‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక త‌మిళ‌నాడుకు చెందిన‌ 25 ఏళ్ల పురాణా సుంతారీ చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయింది. అయినా ఏ మాత్రం బెదరని ఆమె సివిల్స్‌ సాధించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 2019 సివిల్స్ ప‌రీక్ష‌ తుది ఫ‌లితాల్లో పురాణ సుంతారీ 286వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది.

చాలా కష్టమైన పని..

చాలా కష్టమైన పని..

ఆమె అద్భుత ప్ర‌తిభ‌పై స‌ర్వత్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా సైట్లు ఆమె కృషిని కీర్తీస్తూ స్పూర్తిదాయక కథనాలు రాసాయి. ఈ నేపథ్యంలోనే సుంతారీ ప్రతిభ గురించి తెలుసుకున్న మహ్మద్ కైఫ్ సోష‌ల్ మీడియాలో ఆమె విజ‌యాన్ని మెచ్చుకుంటూ స్ఫూర్తిదాయక కథనాన్ని పంచుకున్నాడు.‘కంటి చూపు లేని తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల పురాణ సుంతారీ యూపీఎస్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆమె కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్‌. ఆడియో స్టడీ మెటీరియల్‌తో ప‌రీక్ష‌లు రాయ‌డం చాలా క‌ష్ట‌ం. ఈ విష‌యంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికైంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి దూసుకెళ్లండి.' అంటూ కైఫ్‌ పేర్కొన్నాడు.

నెటిజన్లు కూడా..

నెటిజన్లు కూడా..

ఇక స్పూర్తి దాయక కథనాన్ని షేర్ చేసిన కైఫ్‌కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆమె గురించి వింటుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని ఒకరంటే.. కృషి, పట్టుదల ఉంటే ఏదైన సాధించవచ్చని పురాణా సుంతారీ నిరూపించిందని ఇంకొకరు అన్నారు. చాలా మంది ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదని, సుంతారీ ఐఏఎస్‌గా పేద ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

నాలుగో ప్రయత్నంలో..

నాలుగో ప్రయత్నంలో..

ఇక మ‌ధురైకి చెందిన పురాణా సుంతారీకి త‌న‌ ఐదేళ్ల వ‌య‌సులో కంటి చూపు మంద‌గించింది. ఒక‌టో త‌ర‌గ‌తికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ చ‌దువును ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. త‌ల్లిదండ్రులు, స్నేహితుల స‌హ‌కారంతో కష్ట‌ప‌డి చ‌దివింది. ఐఏఎస్ కావాల‌ని ల‌క్ష్యం పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ప్రిప‌రేష‌న్ కొన‌సాగించింది. మొద‌టి మూడు ప్రయత్నాల్లో చేదు అనుభవమే ఎదురైనా ఏ మాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా మళ్లీ ప్రయత్నించింది. నాలుగో ప్రయత్నంలో 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 13, 2020, 15:51 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X