Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Kaif : శిఖర్ విషయంలో జరిగింది కరెక్ట్ కాదు.. ధావన్ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ ఆడితే ఏంపోయేది

 Mohammed Kaif Felt that Captaicy Changed From Dhawan to Rahul Is not Correct

జింబాబ్వే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను తప్పించి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని నియమించడం సరికాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తొలుత భారత జట్టును ప్రకటించినప్పుడు.. కేఎల్ రాహుల్ జట్టులో భాగం కాదు.. ధావన్ కెప్టెన్ అని సెలెక్షన్ కమిటీ పేర్కొంది. అయితే కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావడంతో అతను తర్వాత జట్టులోకి చేరాడు. అతనికి సెలెక్షన్ కమిటీ కెప్టెన్సీని కూడా అప్పగించింది. రాహుల్‌కి ధావన్‌ని డిప్యూటీగా వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఎన్డీటీవీతో కైఫ్ మాట్లాడాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ జరగకుండా చూసుకోవాల్సిందని, ధావన్‌ తనకు అప్పగించిన కెప్టెన్సీ రోల్‌ను సెలెక్షన్ కమిటీ నిర్ణయం వల్ల వదులుకోవాల్సి రావడం తనకు నచ్చలేదని కైఫ్ చెప్పాడు.

ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సింది

ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సింది

'ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సెలెక్షన్ కమిటీ ప్లాన్ చేయాల్సింది. అక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందనేది అర్థమవుతుంది. కేఎల్ రాహుల్ ఆలస్యంగా జట్టులో చేరి ఉండొచ్చు. జట్టును ప్రకటించినప్పుడే ధావన్ కెప్టెన్ అని పేర్కొన్నప్పుడు.. రాహుల్ అందుబాటులోకి వస్తే అతన్ని కెప్టెన్ అని పేర్కొనాల్సి ఉండేది. ప్రస్తుతం రాహుల్ ఆసియా కప్ కోసం వెళ్లాల్సి ఉంది. అంతకుముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. కాబట్టి తిరిగి జట్టులోకి తీసుకోవడం మంచిదే. అతను శిఖర్ ధావన్‌ కెప్టెన్సీలో ఆడితే ఏం పోయేది. ధావన్ కెప్టెన్సీలో ఆడడం వల్ల పెద్ద తేడా ఏం ఉండదు' అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

ధావన్ పెద్దగా పట్టించుకోడు కానీ అతనికి ఇలా జరగొద్దు

ధావన్ పెద్దగా పట్టించుకోడు కానీ అతనికి ఇలా జరగొద్దు

'ఎవరినైనా కెప్టెన్‌గా ప్రకటిస్తే.. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండాలి. తీసేస్తున్నామని చెప్పేస్తే ప్లేయర్‌కు ప్రశ్నించే అవకాశం ఉండదు. శిఖర్‌ ధావన్ విషయంలో జరిగింది మంచిది కాదు. అతను ప్లేయర్‌గా చాలా కూల్‌గా వ్యవహరించాడు. అతనో స్పోర్టివ్ నెస్ ప్లేయర్. అతను ఈ తతంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఏదేమైనా కెప్టెన్సీ మార్పు విషయంలో శిఖర్ ధావన్‌కి జరిగింది సరైనది కాదు' అని కైఫ్ చెప్పాడు. ఇకపోతే శిఖర్ ధావన్‌లో చాలా క్రికెట్ మిగిలి ఉందని, అతను ఇప్పుడు ఒక ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడని, కానీ మూడు ఫార్మాట్లలో ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్ అని పేర్కొన్నాడు.

జింబాబ్వేతో మూడు వన్డేలకు ఎంపికైన భారత జట్టు:

జింబాబ్వేతో మూడు వన్డేలకు ఎంపికైన భారత జట్టు:

కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.

Story first published: Wednesday, August 17, 2022, 13:35 [IST]
Other articles published on Aug 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+