Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెలెక్టర్లు ప్రదర్శన చూస్తారు.. సుదీర్ఘ విరామం త‌ర్వాత ధోనీ పునరాగ‌మ‌నం కష్టమే: అజ‌ర్

Mohammed Azharuddin says Playing after a long gap is not that easy

హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్‌-13 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు వీడియో కాన్ఫరెన్స్‌, చిట్‌చాట్ లాంటి షోలలో పాల్గొని తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుతున్నారు. కొందరు అతడి భవిష్యత్తుపై, మరికొందరు అతడి సామర్థ్యంపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భార‌త మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ చేరాడు.

 డైలమాలో మహీ భవిష్యత్తు:

డైలమాలో మహీ భవిష్యత్తు:

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ఎంఎస్ ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో మాజీలు అందరూ ధోనీపై చర్చిస్తున్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత తిరిగి అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేయడం క‌ష్ట‌మే అజారుద్దీన్ అన్నాడు. ప్రాక్టీస్‌, మ్యాచ్‌లు ఆడ‌టం వేర్వేరు అని పేర్కొన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మీపిస్తున్న వేళ..సెలెక్ట‌ర్లు జ‌ట్టును ఎంపిక చేసేట‌ప్పుడు ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించాడు.

విరామం త‌ర్వాత పునరాగ‌మ‌నం కష్టమే:

విరామం త‌ర్వాత పునరాగ‌మ‌నం కష్టమే:

తాజాగా మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ మాట్లాడుతూ... 'ధోనీ తనకు కావలసిన దాని గురించి నాకన్నా బాగా వివరించగలడు, ఎందుకంటే అతడి సొంత నిర్ణయం. తిరిగి జ‌ట్టులోకి రావాల వద్దా అన్న‌ది ధోనీ అతడి ఇష్టం కానీ ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. లీగ్ ఎప్ప‌డు మొద‌ల‌వుతుందో తెలియదు. ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జ‌ట్టు ఎంపిక జ‌రగాలి. సుదీర్ఘ విరామం త‌ర్వాత తిరిగి జట్టులోకి రావ‌డం కష్టం. ఎంత స్టార్ ఆట‌గాడైనా.. మ్య‌చ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ప్రాక్టీస్‌, మ్యాచ్‌లు ఆడటం రెండు వేర్వేరు' అని అన్నాడు.

ధోనీని ఎంపిక చేస్తా:

ధోనీని ఎంపిక చేస్తా:

'టీ20 ప్రపంచకప్‌లో ధోనీని ఆడించాలో వద్దో అనే నిర్ణయం పూర్తిగా సెలక్టర్లదే. నేను ఎప్పుడైనా ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నమెంట్‌లకు ధోనీని ఎంపిక చేస్తా. అతని కెప్టెన్సీ, ఫినిషింగ్ నైపుణ్యాలు కచ్చితంగా జట్టుకు ఉపయోగపడుతాయి. 'ఐపీఎల్‌ ఫామ్‌ను బట్టి ధోనీని అంచనా వేయడం సరికాదు. అతడు గొప్ప బ్యాట్స్‌మన్‌. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. అందుకే ఐపీఎల్‌ ఆడాలనుకుంటున్నాడు, కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. అందుబాటులోనే ఉన్నానని చెప్పాలనుకుంటున్నాడు. మానసికంగా ధోనీ విజయం సాధిస్తూనే ఉన్నాడు' అని మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ చెప్పాడు.

 రాహుల్‌కి ఛాన్స్:

రాహుల్‌కి ఛాన్స్:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ రాహుల్‌కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.

Story first published: Saturday, April 18, 2020, 11:07 [IST]
Other articles published on Apr 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+