Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021కు మేం సిద్ధం.. హైద‌రాబాద్‌లో మ్యాచులు నిర్వహించండి: అజహరుద్దీన్

Mohammed Azharuddin said Hyderabad capable of hosting IPL 2021 Matches

హైదరాబాద్: ఇండియ‌న్ ప్రిమియర్ లీగ్ ‌(ఐపీఎల్‌) 2021 లీగ్ మ్యాచులను హైద‌రాబాద్‌లోనూ నిర్వ‌హించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. హైద‌రాబాద్ నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వ‌హించాలంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికే బీసీసీఐని కోరగా.. తాజాగా భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెసీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా మద్దతు పలికారు. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాలని ఆయన బీసీసీఐని కోరారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరగనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పాంత్రంలో ఎన్నికల నేపథ్యంలో.. ఆరు సిటీల్లో మాత్రమే ఐపీఎల్ 20221 మ్యాచ్‌ల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. అయితే ఆ ఆరు సిటీల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కలేదు. బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన సిటీల జాబితాలో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు ఢిల్లీకి చోటు దక్కిందట. అయితే ఢిల్లీ స్థానంలో తొలుత హైదరాబాద్‌నే బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇటీవల ముగిసిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ కనీసం ఒక్క హైదరాబాద్ ఆటగాడిని తీసుకోలేదు. దీంతో ఖైరదాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఐపీఎల్ మ్యాచ్‌ల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాక హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో అంతర్గత కుమ్ములాటలు, కరోనా వైరస్ వ్యాప్తి అంశాల్ని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్‌ని బీసీసీఐ పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌‌‌ల్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. బీసీసీఐని రిక్వెస్ట్ చేశారు.

సోమవారం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కూడా కేటీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. కేటీఆర్ చేసిన విజ్ఞ‌ప్తికి నేను మద్దతు ఇస్తున్నా అని ట్వీట్ చేశారు. 'కేటీఆర్ చేసిన విజ్ఞ‌ప్తికి నేను మద్దతు ఇస్తున్నా. బీసీసీఐ ఆదేశాల ప్ర‌కారం ఐపీఎల్‌ను నిర్వ‌హించే సామ‌ర్థ్యం క‌చ్చితంగా హైద‌రాబాద్‌కు ఉంది. బ‌యో సెక్యూర్ బ‌బుల్‌ను మేము సిద్ధం చేస్తాం' అని అజారుద్దీన్ ట్వీట్ చేశారు. నిజానికి బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసిన న‌గ‌రాల‌తో పోలిస్తే నిజానికి హైద‌రాబాద్‌లోనే కరోనా కేసులు చాలా త‌క్కువ‌గా ఉండడం విశేషం. భారత్-ఇంగ్లండ్ సిరీస్ అనంతరం ఐపీఎల్ జరుగనుంది.

Story first published: Monday, March 1, 2021, 13:58 [IST]
Other articles published on Mar 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+