Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మన క్రికెట్‌ను నాశనం చేస్తారా: బోర్డుకు పాక్ మాజీ వార్నింగ్

లాహోర్: పాకిస్తాన్ ఆదిత్యం ఇవ్వాల్సిన మ్యాచులను యూఏఈలో నిర్వహించడం వల్ల పాకిస్తాన్‌కు (క్రికెట్) నష్టం జరుగుతోందని పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ అన్నాడు. ఫ్లాట్‌, లోబౌన్స్‌ పిచ్‌లపై ఆటగాళ్లను ఆడించి పాక్‌ క్రికెట్‌ను నాశనం చేయొద్దని అతను పాక్ క్రికెట్ బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఏడేళ్ల క్రితం.. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు పైన లాహోర్‌లో దాడులు జరిగాయి. అప్పటి నుంచి పాక్‌లో పర్యటించేందుకు ఏ దేశ క్రికెట్ జట్టు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. 2015లో జింబాబ్వే మాత్రమే పర్యటించింది.

Mohammad Yousuf warns PCB against hosting home series in UAE

గత కొన్నేళ్లుగా పీసీబీ హోం సిరీస్‌లను యూఏఈలో నిర్వహిస్తోంది. దీనిపై యూసుఫ్ మాట్లాడుతూ.. ఫ్లాట్, లోబౌన్స్‌ పిచ్‌లుండే యూఏఈలో గత ఆరేడేళ్లుగా పాక్‌ క్రికెటర్లు ఆడటంతో ఇప్పటికే వారి ఆటలో నైపుణ్యం కొరవడిందన్నాడు.

కనీసం ఇకనైనా యూఏఈలో మ్యాచ్‌ల ఆతిథ్యం ఆపకపోతే అది పాకిస్తాన్ క్రికెట్‌కు భవిష్యత్‌లో తీవ్ర నష్టం కలిగిస్తుందని, అయితే మెరుగైన రికార్డుల కోసమే అక్కడ సిరీస్‌లు నిర్వహిస్తున్నామంటే అది పాక్‌ క్రికెట్‌కు ఏ మాత్రం ఉపయోగపడదన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+