సిక్సర్లు కొట్టడం బానేఉంది.. కానీ అంత బరువుంటే కష్టమే! కోహ్లీని చూసి నేర్చుకో: యూసఫ్

కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్‌కు ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ యూసఫ్ విలువైన సలహాలు ఇచ్చాడు. అజమ్ సిక్సర్లు కొట్టడం బాగుందని, అంత బరువుంటే మాత్రం క్రికెట్‌లో రాణించడం కష్టమే అని అన్నాడు. ప్రతిసారి బంతిని బాదడం కాకుండా.. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లా పరుగులు కూడా తీయాలని సూచించాడు. మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. అయితే అతని బరువు అజమ్‌ను ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. మొయిన్ పాక్ వికెట్ కీపర్‌గా రాణించిన విషయం తెలిసిందే.

5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు:
ఇంత బరువు ఉంటే కష్టమని, ఫిట్‌నెస్ కాపాడుకోవాలని లేదంటే జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు అజమ్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అజమ్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో అతడు ప్రతిభను నిరోపించుకోలేకపోయాడు. బారీ కాయంగా కనిపిస్తున్నా.. అజమ్ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా సిక్సర్లు బాదుతుంటాడు.

అదే ప్లస్, అదే మైనస్:
మహ్మద్ యూసఫ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... 'అజమ్ ఖాన్ ఆటతీరు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. సిక్సర్లు అలవోకగా బాదుతున్న అజమ్‌కు అదే ప్లస్, అదే మైనస్ కూడా. అన్ని సార్లు అతను కొట్టే షాట్లు సిక్సర్లుగా వెళ్లకపోవచ్చు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం బాగుంది. కవర్ డ్రైవ్,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది. అక్కడ అతడి శైలి ఆట సరిపోతుంది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ అవసరం రాదు. ప్రతీసారి సిక్స్ కొట్టడం కాదు.. స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లు అవసరం ఉండదు' అని అన్నాడు.

వెయిట్ తగ్గితే:
'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టైమ్, షాట్ మూమెంట్స్‌ను ఫాలో అవ్వాలి. ఆ విషయంలో అజమ్ ఖాన్ కాస్త వీక్‌గా ఉన్నాడు. దీనికి విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లను పరిశీలించాలి. వారి ఆటతీరు ఎలా ఉందన్నది గమనించాలి. ఏ సమయంలో ఎలా ఆడుతున్నారన్నది నిశితంగా పరిశీలించాలి. ఇక అజమ్ హెవీ వెయిట్ అతనికి మరో మైనస్. ముందు అతని వెయిట్ తగ్గితే సగం ఒత్తిడి తొలిగిపోయినట్లే. ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఎంపికైతే.. బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదగడం ఖాయం' అని మహ్మద్ యూసఫ్ ధీమా వ్యక్తం చేశాడు.

మంచి వికెట్ కీపర్‌గా మొయిన్:
మొయిన్ ఖాన్ పాకిస్తాన్ వికెట్ కీపర్‌గా మంచి పేరు సంపాదించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. 1990-2004 వరకు పాక్ జట్టుకు ఆడిన మొయిన్ ఖాన్ 69 టెస్టుల్లో 2741 పరుగులు.. 219 వన్డేల్లో 3266 పరుగులు చేశాడు. కొంతకాలం పాటు పాక్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన మొయిన్.. రిటైర్మెంట్ అనంతరం జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications